కథానాయికలకు కెరీర్ విషయంలో బోలెడన్ని అంచనాలు, లెక్కలు వుంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరిప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా సిద్ధాంతాలను ఫాలో అవుతారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను కొనసాగిస్తారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం ఎటువంటి అంచనాలు, లెక్కలు లేకుండానే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను చిత్రరంగాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కెరీర్ మొదట్లోనే సీనియర్ కథానాయకులతో నటిస్తూ చిత్ర రంగంలో తన రూటే సెపరేట్ అని నిరూపించుకుంటోంది ఈ హర్యానా సుందరి.
Advertisement
తెలుగునాట తొలి చిత్రంతోనే టాలీవుడ్ కుర్రకారు మనసు పై చెరగని ముద్ర వేసిన హరీయిన్ పాయల్‌రాజ్‌పుత్. 2017లో విడుదలైన ఆర్ఎక్స్100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది. టాలీవుడ్‌లో వచ్చిన రెండవ సంవత్సరంలోనే తెలుగు నాట సీత, ఆర్ ఎక్స్‌లవ్,యన్.టి.ఆర్. కథానాయకుడు, వెంకీమామలాంటి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. 2020లో విడుదలైన డిస్కో రాజాల చిత్రాలలోతన అందం, అభినంతో అభిమానులకు పిచ్చెక్కిచ్చింది.
Advertisement
ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అని పాయల్ రాజ్‌పుత్‌కు పేరు వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు జయంత్‌సి.పరాన్జీ తాజా చిత్రంలో నరేంద్రలో ఫిమేల్ ఫైటర్ పైలట్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలెట్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. ప్రస్తుతం `3రోజెస్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. `ఆహా` యాప్‌లో ఈ వెబ్ సిరీస్ శుక్రవారంనవంబర్ 12న విడుదలైంది. ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ మహిళలు, అమ్మాయిల స్వేచ్ఛని తెలియజేస్తుందట.