Home » PAYALGHOSH : తారక్ గ్లోబల్ స్టార్…బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేస్తుంది…!

PAYALGHOSH : తారక్ గ్లోబల్ స్టార్…బాలీవుడ్ ను టాలీవుడ్ బీట్ చేస్తుంది…!

by AJAY
Ad

ప్రస్తుతం తెలుగు సినిమాల రేంజ్ పెరిగిపోయింది. బాహుబలి లాంటి సినిమాతో తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. ఇటీవ‌లే విడుదలైన పుష్ప సినిమాతో ఆ క్రేజ్ డబుల్ అయింది. దాంతో బాలీవుడ్ హీరోయిన్లు సైతం టాలీవుడ్ హీరోలతో నటించేందుకు ఇష్టపడుతున్నారు. అప్ప‌ట్లో టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ హీరోయిన్లు నో చెప్పేవారు…. కానీ ఇప్పుడు మాత్రం వాళ్లే నోరు తెరిచి మరీ తెలుగు హీరోలతో నటించాలని ఉంది అంటూ చెబుతున్న సంగతి తెలిసిందే.

payal ghosh ntr

Advertisement

ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అల్లు అర్జున్ తో కలిసి నటించాలనివుందని కామెంట్ చేసింది. అంతేకాకుండా దీపికా పదుకునే సైతం టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇక ప్రభాస్ తో ఇప్పటికే దీపికా పదుకొనే ఓ సినిమాలో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో సైతం ప్రభాస్ సినిమా చేశాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అంటూ దీపికా పదుకొనే చేసిన కామెంట్ పై ఊసరవెల్లి హీరోయిన్ ఆసక్తికర కామెంట్ చేసింది.

Advertisement

తారక్ తో కలిసి పని చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్లు క్యూ కడుతున్నారు. నేను ఈపాటికే ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించి నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా సినిమా గురించి చర్చిస్తారని నేను 2020 సంవత్సరంలో చెప్పాను. కానీ అప్పుడు న‌న్ను చాలా విమర్శించారు. ఇప్పుడు మరోసారి చెబుతున్నా…. త్వరలోనే దక్షిణాది చిత్ర పరిశ్రమ బాలీవుడ్ ను సైతం కైవసం చేసుకుంటుంది.

అసభ్య పదజాలం అసభ్యకర సన్నివేశాలు చూపించడం మారకపోతే బాలీవుడ్ అంతం కాక తప్పదు. అయినా బాలీవుడ్ కథ ఇప్ప‌టికే ముగిసింది. అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించింది. గ్లోబల్ స్టార్ ఉన్నతమైన వ్యక్తి అంతకుమించి ఆల్రౌండర్ సూపర్ స్టార్ ఇవన్నీ చెప్తుంటే నన్ను విమ‌ర్శించారు. కానీ నేను అతని వైపు నిలబడి ఉన్నాను. ఈరోజు నేను చెప్పింది నిజమైంది అంటూ పేర్కొంది.

Visitors Are Also Reading