Home » పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ మూవీని వద్దనుకోవడం వెనుక.. ఇంత పెద్ద ట్విస్ట్ ఉందా..!!

పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ మూవీని వద్దనుకోవడం వెనుక.. ఇంత పెద్ద ట్విస్ట్ ఉందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ చిరంజీవికి అతి పెద్ద హిట్టు ఇచ్చింది. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి హీరో, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సత్యదేవ్ నయనతార, పూరి జగన్నాథ్ తదితరులు కీలకమైన పాత్రలో చేశారు.. ప్రస్తుతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించే అవకాశం పవన్ కళ్యాణ్ వచ్చిందట.. ఏం జరిగిందో ఏమోకానీ మళ్లీ అదే పాత్రను సల్మాన్ ఖాన్ పోషించారట..

Advertisement

also read:ఖరీదైన కార్లలో తిరిగిన ఈ స్టార్ కమెడియన్..చివరికి డొక్కు సైకిల్ పై..కారణం వాళ్లేనా..?

Advertisement

కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించి ఉంటే బాగుండు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ను చేసి ఉంటే సినిమా మరింత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం తెలుగు ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ పాత్ర అంతగా నచ్చలేదని అర్థమవుతోంది. ఈ నటుడు కేవలం హిందీ లో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడ్డారు కానీ మిగతా భాషల్లో ఆయన ప్రభావం చూపించలేకపోయారట.

దీంతో ఫ్యాన్స్ పవన్ ఈ ప్లేస్ లో నటించి ఉంటే మెగా అన్నదమ్ముల ఇద్దరినీ ఒకే టైం లో తెరపై చూస్తే ఆ “కిక్కే వేరబ్బా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విషయంపై దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ ను తీసుకోవడం తన ఛాయిస్ మాత్రమే అని, ఆయనను కేవలం అలంకరణ కోసమే తీసుకున్నానని, పర్సనల్ కలెక్షన్ కోసం ఏమాత్రం ఆలోచించలేదని తెలియజేశారు.. అలాగే సల్మాన్ ఖాన్ అయితే ఫ్రెష్ గా ఉంటుందని, అందుకోసమే పవన్ కళ్యాణ్ ను ఈ సినిమాలో తీసుకోలేదని వెల్లడించారు.

also read:

Visitors Are Also Reading