Home » పవన్ త్రివిక్రమ్ కాంబోలో ప్రారంభించిన కోబలి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా…?

పవన్ త్రివిక్రమ్ కాంబోలో ప్రారంభించిన కోబలి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా…?

by AJAY
Ad

కొన్ని సినిమాలు షూటింగ్ ప్రారంభించిన తర్వాత కూడా అనేక కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతాయి. మొదట సినిమా హిట్ అవుతుందని ప్రారంభించి ఆ తర్వాత నమ్మకం లేక ఆపేసిన సినిమాలు ఉంటాయి. అంతేకాకుండా బడ్జెట్ కారణాలవల్ల.. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల కూడా సినిమాలు ఆగిపోతాయి. అలా ప్రతి హీరో కెరీర్ లో కూడా ఆగిపోయిన సినిమా ఒకటి అయినా కచ్చితంగా ఉంటుంది.

Advertisement

అలానే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయింది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు వచ్చినా టీవీలో మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.

Advertisement

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో పవన్ అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లోనే కోబలి అనే మరో సినిమా కూడా ప్రారంభించారు.

రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమాను మధ్యలోనే ఆపివేశారు. కానీ ఈ సినిమా పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా సినిమా పోస్టర్ లో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించడం విశేషం.

Visitors Are Also Reading