Home » భార్య మధ్యన ఆనందడోలికల్లో పవన్…ఫోటో అదుర్స్….!

భార్య మధ్యన ఆనందడోలికల్లో పవన్…ఫోటో అదుర్స్….!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మిగతా హీరోల అభిమానులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లకు అయినా ఫ్యామిలీ ఫంక్షన్లకు అయినా కాస్త దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. చాలా ఫ్యామిలీ ఫంక్షన్ లలో మెగా కుటుంబసభ్యులంతా కలిసి ఫోటో దిగుతారు. కానీ పవర్ స్టార్ మాత్రం ఎక్కడా కనిపించడు. ఇక సినిమాల విషయానికి వస్తే తన సినిమా ఆడియో ఫంక్షన్స్ మినహా సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడం… ఇతర ఈవెంట్లకు వెళ్లడం లాంటివి కూడా పెద్దగా కనిపించవు.

Pawan Kalyan with mother and wife

Pawan Kalyan with mother and wife

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన తల్లి మరియు శ్రీమతి తో కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కు ముందు తన భార్య తో కలిసి రష్యా వెళ్లారు. భార్యను మరియు పిల్లలను అక్కడే వదిలి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ ఎయిర్ పోర్ట్ లో కొత్త లుక్ తో కనిపించాడు. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ తన భార్యను ఇండియాకు తీసుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

Advertisement

Advertisement

Pawan kalyan wife

Pawan kalyan wife

తన భార్య మరియు తల్లి మధ్యలో పవన్ కళ్యాణ్ కూర్చుని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనీదేవి నవ్వుతూ ఉండగా పవన్ మరియు ఆయన సతీమణి కూడా ఎంతో ఆహ్లాదంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటో చూసిన పవన్ అభిమానులు సైతం మురిసిపోతున్నారు. అన్న వదిన అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Pawan kalyan wife

Pawan kalyan wife

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా నిజానికి విడుదల కావాల్సి ఉంది కానీ ఆర్ఆర్ఆర్ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కబోతోంది. అదేవిధంగా హరీష్ శంకర్ తో కూడా పవన్ ఓ సినిమా చేస్తున్నారు.

Also read : సిద్దార్థ్ కామెంట్లతో మా కుటుంబం డిస్టబ్ అయ్యింది… భయటకు వచ్చి స్వారీ చెప్పాలి : సైనా నెహ్వాల్ తండ్రి డిమాండ్

Visitors Are Also Reading