Home » భీమ్లా నాయక్ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయస్ కాదట..ఎవరంటే ?

భీమ్లా నాయక్ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయస్ కాదట..ఎవరంటే ?

by Anji
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం విదితమే. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా రానా అదరగొట్టారు. మొదటి సారి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. డైరెక్టర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. నిత్యామీనన్ కథానాయికగా నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఎవరో కాటండోయ్.. నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఇటీవల అన్ స్టాపబుల్ షోలో బయటపెట్టారు.

Advertisement

ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య తనదైన పంచులు ప్రాసల తో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. అలాగే తన స్టైల్ లో అతిథుల నుంచి సమాధానాలు రాబడుతూ మెప్పిస్తున్నారు. మొదటి ఎపిసోడ్ టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ సందడి చేయగా.. రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ విశ్వక్ సేన్ లు వచ్చారు. ఇక ఆ తర్వాత వచ్చిన నిర్మాత సూర్యదేవర నాగవంశీని సైతం ఓ ఆటాడుకున్నారు బాలయ్య. ఈ తరుణంలో పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను రాబట్టారు.

Advertisement

ఈ సినిమాకు ఫస్ట్ హీరో ఎవరు అని అడగగా.. మీరే సార్, మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని అడిగి సినిమా చూసి మీరే కదా సార్ నాకు సాజిస్ట్ చేశారు. కళ్యాణ్ గారికి అయితే బాగుంటుందని అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది.

Also Read :  వీరసింహారెడ్డి గా రాబోతున్న బాలయ్య

Visitors Are Also Reading