జనసేనాని పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలను సమర్ధవంతంగా నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అందుకు తగ్గట్లే ప్రిపేర్ అవుతున్నట్లు ఉన్నారు. ప్రచారంలో భాగంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర” ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రజల మధ్య ఉండి, ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఈ యాత్రను సంకల్పించారు. ఇప్పటికే రెండు విడతలు సక్సెస్ ఫుల్ గా సాగగా, మూడవ విడత వారాహి యాత్ర మొదలైంది.
Advertisement
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రో సినిమా రిలీజ్ కాగా, మరో వైపు ఓజీ, ఉస్తాద్ భగత్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ ఇంకా హరిహర వీరమల్లు సినిమా చేయాల్సి ఉంది. ఓ వైపు ఎన్నికల వలన రాజకీయపరంగా పవన్ షెడ్యూల్ బిజీ గా ఉంది. దీనితో ఈ సినిమా ఎన్నికల తరువాత వస్తుందని అంటున్నారు.
Advertisement
మూడవ విడత వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ వైజాగ్ లోని జగదాంబ సెంటర్ లో వారాహి వ్యాన్ పై నుంచుని మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాతికేళ్ల క్రితం విడుదల అయిన “సుస్వాగతం” సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. పాతికేళ్ల క్రితం ఇదే జగదాంబ సెంటర్ లో సుస్వాగతం సినిమా కోసం బస్సు పై డాన్స్ చేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు మీ ముందు వారాహిపై నుంచుని మాట్లాడుతున్నానని పవన్ అన్నారు. ఆ సినిమా చేసినప్పుడు ఎందుకు సినిమాల్లోకి వచ్చానా అని బాధపడ్డానని, నాకు అసలే సిగ్గు, బిడియం ఎక్కువ, ఎవరితోనూ మాట్లాడలేను.. ఆ ఫ్రస్టేషన్ లోనే నేను మా వదినకి ఫోన్ చేసి, నేను ఎందుకు నటుడిని అయ్యాను? ఇదే ఆఖరి సినిమా.. ఇక సినిమాలు చేయకూడదు అని ఫిక్స్ అయ్యా అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. కానీ ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఎదిగారో మనకి తెలిసిందే.
మరిన్ని ముఖ్యమైన వార్తలు :
యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉండండి..! అప్పుడు వృద్ధాప్యం సంతోషంగా గడిచిపోతుంది..!
బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..!
భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!