Home » Pawan kalyan: పవన్ ఆ రీమేక్ చేయబోతున్నాడట ! ఈ సినిమాని ఫాన్స్ ఒప్పుకుంటారా ?

Pawan kalyan: పవన్ ఆ రీమేక్ చేయబోతున్నాడట ! ఈ సినిమాని ఫాన్స్ ఒప్పుకుంటారా ?

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయ‌క్ సినిమా రీసెంట్ గా విడుద‌లైంది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గానే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రస్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు.

Advertisement

మ‌రోవైపు క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ కల్యాణ్ మ‌రో మూడు రీమేక్ సినిమాల‌ను లైన్ లో పెట్టినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

థేరీ త‌మిళ్ లో విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా థేరీ. ఈ సినిమాలో స‌మంత, అమీ జాక్స‌న్ హీరోయిన్ లుగా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

వినోద‌య చిత్తం సినిమాకు ప్ర‌ముక న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. ఈ త‌మిళ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.ఇక ఈ సినిమాను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

2017లో మాద‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో విక్ర‌మ్ వేద సినిమా వ‌చ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాను ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్.

Also Read: SRIREDDY : బాల‌య్యను వియ్యంకుడిని చేసుకుని ఎన్టీఆర్ ను తొక్కేశారు….శ్రీరెడ్డి సంచ‌ల‌నం..!

Visitors Are Also Reading