Home » షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే !

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే !

by Bunty

మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పవన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోగా ఉన్నారు. పవన్ తన సినిమాల ద్వారా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే, షూటింగ్ మధ్యలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఆగిపోయాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

# సత్యాగ్రహి

జానీ సినిమా సమయంలోనే స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. దానికి సత్యాగ్రహి అని ఒక టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఈ టైటిల్ ఏ సినిమాపై విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. కానీ జానీ సినిమా ఫ్లాప్ తో ఈ సినిమాపై ఇంపాక్ట్ పడింది. అందుకే ఈ ప్రాజెక్టు సైడ్ అయిపోయింది.

# దేశీ

దేశభక్తి నేపథ్యంలో కూడా పవర్ స్టార్ ఒక సినిమా తీయాలని అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయినప్పటికీ ఈ సినిమా పట్టాలెక్కలేదు.

# కోబలి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ మూవీ గా కోబలి సినిమాని ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఇదే కథలో కొన్ని మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేసినట్లు టాక్ ఉంది.

# ప్రిన్స్ ఆఫ్ పీస్

సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే ఏసుక్రీస్తు చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తీయాలనుకున్నారు. 2010లో స్టార్ట్ చేసిన ఈ మూవీకి కొంత భాగం షెడ్యూల్ కూడా జెరూసలేం లో పూర్తయింది. కానీ ఎందుకో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

READ ALSO : అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్

Visitors Are Also Reading