పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. తమ్ముడు సినిమా నుండి ఈ ట్రెండ్ కొనసాగుతూ వస్తుంది. మ్యాక్జిమమ్ ఆ ఫోక్ సాంగ్ ను దర్శకులు పవన్ కళ్యాణ్ తోనే పాడిస్తూ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.
అలా ఇప్పటి వరకు పవన్ తన సినిమాల్లో 8 పాటలు పాడారు. ఆ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
Advertisement
1,2) తాటిచెట్టెక్కలేవు, ఏం పిల్ల మాటాడవా?
పవన్ ను స్టార్ హీరోగా మార్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు పాటలు పాడారు. 1999లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
3) బైబైయ్యే బంగారు రమణమ్మ :
అలీతో కలిసి కామెడీని మిక్స్ ఆప్ చేస్తూ పాడిన పాట ఇది.! 2001లో విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
Advertisement
4,5) నువ్వు సారా తాగుడు మాను అన్న & రావోయి మా కంట్రీకీ
పవన్ ఇష్టంగా సొంతంగా డైరెక్ట్ చేసిన సినిమా జానీ. ఈ సినిమాలో పవన్ రెండు పాటలు పాడారు. అవి నువ్వు సారా తాగుడు మాను అన్న & రావోయి మా కంట్రీకీ . 2003లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చింది.
6) కాటమరాయుడా…కదిరి నర్సింహుడా
2013లో రిలీజైన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడా అనే పాటను పాడారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
7) కొడకా కోటేశ్వర్రావు కరుసైపోతావురా..
2018లో రిలీజైన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ ఈ పాటను పాడారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
8) నభో నభో లబ్బరి గాజులు:
గుడుంబా శంకర్ సినిమాలోని కిళ్లీ కిళ్లీ అనే పాటకు ముందు వచ్చే నభో నభో లబరి గాజులు అనే స్టార్టింగ్ లిరిక్స్ పవన్ కళ్యాణ్ పాడారు. ఈ సినిమా యావరేజ్ గా నిల్చింది.