Home » ప‌వ‌న్ చేతికి ఉన్న ఆ ఉంగ‌రం ప్ర‌త్యేకత ఏంటో తెలుసా…!

ప‌వ‌న్ చేతికి ఉన్న ఆ ఉంగ‌రం ప్ర‌త్యేకత ఏంటో తెలుసా…!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్ప‌నుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ మరియు హరిహర వీరమల్లు అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

ఇది ఇలా ఉండగానే మరో మూడు తమిళ సినిమాలను రీమేక్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పవన్ సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ తెలంగాణలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తన పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు.

Advertisement

రీసెంట్ గా జనసేన ఆవిర్భవించి తొమ్మిది వసంతాలు అవుతున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభలో పవన్ వేలికి ఉన్న ఉంగరం హైలెట్ అయ్యింది. అయితే ఈ ఉంగ‌రానికి ఓ ప్రత్యేకత ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ధరించిన ఉంగ‌రాన్ని పగడపు ఉంగరం అని అంటారు. ఈ ఉంగ‌రాన్ని ధరించడం వల్ల జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ALSO READ : చిన‌జీయ‌ర్ కు బండ్ల గ‌ణేష్ స‌పోర్ట్…అవ‌స‌ర‌మా అంటూ నెటిజ‌న్లు ఫైర్…!

పవన్ కళ్యాణ్ ఎక్కువగా దేవుళ్లను ఆరాధిస్తారన్న‌ సంగతి తెలిసిందే. సంస్కృతి సంప్రదాయాలపై పవన్ కళ్యాణ్ కు ఎంతో గౌరవం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పవన్ పగడపు ఉంగరాన్ని ధరించి ఉంటారు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Visitors Are Also Reading