పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలలో నటిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి న్యాయం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల సినిమాలపై ఆసక్తిని చూపించడం లేదు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాను రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…
Advertisement
# ఇడియట్
2002 సంవత్సరంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఇడియట్ సినిమాలో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ రవితేజను వరించింది.
# అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
2003లో వచ్చినటువంటి అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో పవన్ కళ్యాణ్ అయితే సినిమా ఇంకా బాగుంటుందని అందరూ భావించారట. కానీ అప్పటికే వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.
# పోకిరి
Advertisement
పూరి జగన్నాథ్-మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సెలెక్ట్ చేసుకున్నారట పూరి జగన్నాథ్. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబును సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
# అతడు
అతడు సినిమా స్టోరీని త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ చెబుతుంటే నిద్రపోయి ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ వినకుండా రిజెక్ట్ చేశారట.
# మిరపకాయ్
2011 హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి మిరపకాయ్ సినిమా కథను మొదటగా పవన్ కళ్యాణ్ కు చెప్పారట. కానీ ఈ సినిమా కథ నచ్చి నచ్చకనో పవన్ కళ్యాణ్ చాలా సునాయాసంగా రిజెక్ట్ చేశారట.
# సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
2013 శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో వెంకటేష్ కు తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారట. కానీ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబును సెలెక్ట్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?
టాలీవుడ్ హీరోలకు భార్యలుగా ఇంతమంది రెడ్డి అమ్మాయిలా…!
అంత అందం ఉన్నా.. బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాలేకపోయారు ?