Home » ప‌వన్ క‌ల్యాణ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

ప‌వన్ క‌ల్యాణ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

by Anji
Ad

చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ కుటుంబాల్లో ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఒక‌టి. ఈ ఫ్యామిలీ ఉంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది తెలుగు తెర‌కు ప‌రిచ‌చ‌మ‌య్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. కానీ కుటుంబంలో చిరంజీవి త‌రువాత అంత క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవ‌రైనా ఉన్నారంటే అది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని అందరికీ తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానులు ఎలా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు.

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ముద్దుల త‌మ్ముడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడ్డుపెట్టిన ప‌వ‌న్ త‌న మొద‌టి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ త‌రువాత వ‌చ్చిన ప‌లు అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించి అటు ఫ్యామిలీ ఇటు యువ‌త‌కు ద‌గ్గ‌రయ్యారు. 2000 త‌రువాత నుంచి మాస్ హీరోగా అవ‌త‌రించి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డంతో పాటు.. హోదా కూడా సృష్టంచుకున్నారు. వ‌రుస ప‌రాజ‌యాలు వెక్కిరించిన తిరిగి హిట్ కొట్టి టాలీవుడ్‌లో త‌న స్థానం ఎవ‌రు అందుకోలేర‌ని ఇప్ప‌టికీ నిరూపిస్తూనే ఉన్నారు.

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు మాట విలువ‌ను కాపాడుకోవాలి

Advertisement

ప‌వ‌న్‌కు సినిమాల‌తో పాటు రాజ‌కీయాలు, సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ఎంతో ఇష్టం . ఇండ‌స్ట్రీలో త‌న లాంటి భావాజాలం ఉన్న వారిని త‌న స్నేహితులుగా మార్చుకున్నారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, క‌ళా ద‌ర్శ‌కుడు ఆనంద్ సాయిలు ప‌వ‌న్‌కు అత్యంత ఆత్మీయులు. ముఖ్యంగా చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు తొలిసారి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించి పార్టీ యువ విభాగం యువ‌రాజ్యం అధ్య‌క్షునిగా వ్య‌వ‌హరించారు. ఆ తరువాత తనే స్వ‌యంగా జ‌న‌సేన పార్టీ స్థాపించారు. 2024 ఏపీ ఎన్నిక‌ల్లో కీల‌క‌పాత్ర పోషించాల‌ని భావిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస్తుల వివ‌రాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే. ఒక్కో సినిమాకు భారీ ఎత్తున పారితోషికం తీసుకునే ప‌వ‌న్ 2019 ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌మ‌యానికి ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం.. త‌న మొత్తం ఆస్తి రూ.56 కోట్ల‌ని తెలిపారు. త‌న‌కు వ్యాపారాల్లో కంటే భూములు, నివాస గృహాల మీద ఎక్క‌వ పెట్టుబ‌డులు పెట్టారు.

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ త‌దిత‌ర ప్రాంతాల్లో నివాస గృహాలు, వ్య‌వ‌సాయ భూములు, వ్య‌వ‌సాయేత‌ర భూములున్నాయి. ప‌వ‌న్ కు బ్యాంకు ప‌లు బాండ్స్‌ల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కింద రూ. సుమారు 5 కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. ప‌వ‌న్ కు హ‌ర్లి డేవిడ్‌స‌న్ బైకు, స్కార్పియో, మెర్సిడెస్ బెంజ్‌, స్కోడా టయోటా, వోల్వా వంటి వాహ‌నాలున్నాయి.

 

Also Read :  కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన ర‌ష్మిక

Visitors Are Also Reading