Home » నాకు పవన్ కళ్యాణ్ అవసరం లేదంటున్న చిరు..!

నాకు పవన్ కళ్యాణ్ అవసరం లేదంటున్న చిరు..!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి మొదట ఒంటరిగా సినిమాల్లోకి వచ్చి.. తర్వాత మొత్తం ఫ్యామిలీని కూడా ఈ రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలిలో ఉన్న అందరూ హీరోల కంటే.. మెగాస్టార్ కంటే కూడా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే మెగా హీరోల సినిమా ఈవెంట్స్ కు పవన్ కళ్యాణ్ ఎక్కువగా వస్తాడు.
ఇక ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ మధ్యే ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించిన చిరంజీవి.. వరుస ఇంటర్వ్యూలు అనేవి ఇస్తున్నాడు. ఇక ఈ గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు వార్తలు అనేవి తెగ వచ్చాయి. దాంతో మెగా ఫుల్ ఖుషి అయ్యారు అనేది నిజం. కానీ ఇప్పుడు ఆ సంతోషం అనేది నిరాశగా మారుతుంది.
ఎందుకంటే.. ఈ సినిమా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావడం లేదు. అయితే ప్రస్తుతం పవన్.. అమెరికాలో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఈవెంట్ కోసం గాడ్ ఫాదర్ నిర్మాతలు సంప్రదించిన కూడా ఫలితం అనేది లేకుండా పోయింది. ఆ సమయంలోనే మీరు పిలిస్తే పవన్ వస్తాడు అని నిర్మాతలు.. చిరంజీవికి చెప్పగా.. చిరు కూడా అవసరం లేదు.. ఇప్పుడు పవన్ ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading