Home » పవన్ మిస్ చేసుకున్న 5 బ్లాక్ బస్టర్ సినిమాలు…!

పవన్ మిస్ చేసుకున్న 5 బ్లాక్ బస్టర్ సినిమాలు…!

by AJAY
Ad

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి బ్రాండ్ ఇమేజ్ ఉంది. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్ లతో వచ్చినప్పటికీ గబ్బర్ సింగ్ తో మళ్లీ సక్సెస్ ను అందుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ముందు కొన్ని మంచి కథలు వచ్చినప్పటికీ అనేక కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి కథను ముందుగా పవన్ కళ్యాణ్ కు పూరి వినిపించారట. కానీ పవన్ కళ్యాణ్ తాను హీరోగా నటించిన తమ్ముడు సినిమా కథ కూడా ఇదే విధంగా ఉంటుందని ఈ చిత్రానికి నో చెప్పారట.


పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మరో సినిమా ఇడియట్ కూడా పూరీ జగన్నాథ్ ద్వారా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది. కానీ పవన్ కళ్యాణ్ ఇడియట్ కథకు తను సూట్ కానని ఈ సినిమా చేయనని సున్నితంగా తిరస్కరించాడట.

Advertisement

nuvve-kaavali
ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రొమాంటిక్ ఎంటర్టైనర్ నువ్వేకావాలి. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా కు ఉదయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. అయితే ఇదే సినిమాను మొదటగా పవన్ కళ్యాణ్ తో చెప్పాలని ఉంది అనే టైటిల్ తో షూటింగ్ ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నువ్వే కావాలి అనే టైటిల్ తో తరుణ్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


సూర్య హీరోగా నటించిన విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా గజిని. ఈ సినిమా కూడా ముందుగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది. కానీ పవన్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు.

Khaidi no 150

మెగా స్టార్ హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా మొదటగా పవన్ కళ్యాణ్ వద్దకే వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేయనని చెప్పారట.

 

Also read : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే…!

Visitors Are Also Reading