Home » గాడ్ ఫాథర్ లో కనిపించబోతున్న గెస్ట్ హీరో..?

గాడ్ ఫాథర్ లో కనిపించబోతున్న గెస్ట్ హీరో..?

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు అనేవి చేస్తున్నాడు. ఆయన ఆఖరిగా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ నుండి మెగాస్టార్ తొందరగానే కోలుకున్నారు. ఇక ఆయన ప్రస్తుతం తన కొత్త సినిమాల షూటింగ్స్ తప్ బిజీగా ఉన్నారు. అయితే మెగాస్టార్ ఇప్పటికే మూడు సినిమాలు అనేవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

అందులో గాడ్ ఫాథర్ సినిమా కూడా ఒక్కటి. మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు అనేవి మంచిగానే ఉన్నాయి. అయితే ఈ మధ్యే మెగాస్టార్ నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా మరో హీరో ఉంటున్నాడు అనేది అందరికి తెలిసిందే. ఈ గాడ్ ఫాథర్ సినిమాలో అయితే ఏకంగా బాలీవుడ్ టార్ సల్మాన్ ఖాన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో మరో హీరో కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమాచారం అందుతుంది. ఇక అది ఎవరో కాదు..మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అయితే ఈ వార్త అనేది బయటకు వచ్చిన తర్వాత నుండి మెగా ఫ్యాన్స్ అందరూ తెగ ఆనందపడిపోతున్నారు. చూడాలి మరి ఈ గాడ్ ఫాథర్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో కనిపిస్తాడు అనేది.

ఇవి కూడా చదవండి :

పడిపోయిన బాబర్, సూర్య కుమార్..!

ఇప్పటికైనా సంజూకి అవకాశాలు ఇస్తారా…?

Visitors Are Also Reading