పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కాగా మశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. తెలంగాణలో ఎక్కువ షోలు వేసేందుకు అనుమతులు ఇవ్వడం…టికెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉండటంతో ఏపీ కంటే తెలంగాణలో కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయి.
Advertisement
ఏపీలో టికెట్ ధరలపై ఆంక్షలు ఉండటం…ఎక్కువ షోలకు అనుమతులు లేకపోవడంతోనే ఎక్కువ లాభాలు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే భీమ్లానాయక్ సినిమా విడుదల తరవాత ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ముందుగానే తెలుసుకున్నారట.
Advertisement
భీమ్లానాయక్ సినిమా విడుదల తరవాతనే కొత్త జీవో వస్తుందని అనుకున్నారట. అంతే కాకుండా తన సినిమాకు నష్టం వచ్చినా పర్లేదు కానీ ఇతర సినిమాలు తన వల్ల నష్టపోకూడదని భీమ్లా నాయక్ ను జీవో రాకముందే విడుదల చేశారట. ఈ విషయాన్ని భీమ్లా నాయక్ ఈస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ తాజాగా బయటపెట్టారు.
అంతే కాకుండా ఏపీలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ లకు తాను డబ్బులు ఇస్తానని పవన్ కల్యాణ్ ముందుగానే హామీ ఇచ్చారని అన్నారు. ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ సినిమాలతో పాటూ రాజకీయాలలోనూ ఎంతో చురుకుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం పై పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఆయన సినిమాలపై ఆంక్షలు విధించారని పవన్ కల్యాణ్ పలుసార్లు ఆరోపించారు.