పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటూ రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీతో పాటూ తెలంగాణలో కూడా జనసేన స్థాపనకు పవన్ కష్టపడతున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీ నేతలు పవన్ కల్యాణ్ ను అనేకసార్లు ఆయన మూడు పెళ్లిళ్ల విషయం పై విమర్శించారు. దాంతో పవన్ కల్యాణ్ కూడా ఆ విమర్శల పై అసహనం వ్యక్తం చేశారు.
Advertisement
రీసెంట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో లో కూడా పవన్ మాట్లాడుతూ నేను ఒకే సారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. ఒకరికి విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకున్నానని చెప్పారు. అంతే కాకుండా తనను విమర్శించేవారి పై అసహనం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే పవన్ మూడు పెళ్లిళ్ల విషయానికి వస్తే మొదట పవన్ 1997 సంవత్సరంలో నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
Advertisement
ఆ తరవాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు. 2012లో రేణూదేశాయ్ తోనూ విడిపోయాడు. ఆ తరవాత అన్నా లెజొనావాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అన్నా లెజోనోవాతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఇద్దరి గురించి ప్రేక్షకులకు తెలుసు కానీ పవన్ మొదటి భార్య నందిని గురించి మాత్రం తక్కవ మందికి తెలుసు.
దాంతో నందిని ఎవరు..? ఆమె ప్రస్తుతం ఎలా ఉన్నారు అని నెట్టింట వెతుకుతున్నారు. పవన్ మొదటి భార్య నందిని విడాకుల తరవాత తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. అంతే కాకుండా 2010 లో డాక్టర్ కృష్ణారెడ్డిని ఆమె వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా జాహ్నవి తన భర్తతో అమెరికాలో సెటిల్ అయ్యింది.