Home » Video Viral : కాన్వాయ్ పై కింద‌ పడ్డ పవన్ కళ్యాణ్

Video Viral : కాన్వాయ్ పై కింద‌ పడ్డ పవన్ కళ్యాణ్

by Anji
Ad

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఓ వైపు సినిమా హీరోగా, మ‌రొక వైపు రాజ‌కీయ నేత‌గా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ నిత్యం ప్ర‌జ‌ల కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

Also Read :  ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా అలీ…?

Advertisement

మ‌త్స్య కార్మికుల హ‌క్కుల కోసం ఇవాళ న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌హిరంగస‌భ‌లో కూడా ప్ర‌సంగించ‌నున్నారు. అయితే న‌ర‌సాపురం చేరుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంద‌ని చెప్పాలి.

Advertisement

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ర‌సాపురం చేరుకుని త‌న కాన్వాయ్ పైకి ఎక్కి నిల్చున్నారు. ప్ర‌జ‌ల‌కు, త‌న అభిమానుల‌కు అభివాదం చేశారు. ఈ త‌రుణంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఒక్క‌సారిగా కాన్వాయ్ పైకి ఎక్కి ప‌వ‌న్‌పై ప‌డిపోయాడు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌సారిగా బొక్క‌బోర్లా ప‌డ్డాడు. వెంట‌నే లేచాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ కింద ప‌డిపోయిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/i/status/1495356807207735299

Visitors Are Also Reading