తనపై విమర్శలు చేసిన ఏపీ మంత్రి రోజాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డైమండ్ రాణి అంటూ సెటైర్లు వేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు.
Advertisement
నువ్వు కూడానా? ఛీ! నా బతుకు చెడ! మీ కోసం డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకుంటా. ప్రతి వెధవ, సన్నాసితో మాటలు పడుతున్న, నాకు ఓకే. మీ కోసం ఎవడు రాడు. మీరే నిలబడాలి. మీ కోసం నిలబడే వారికి మీరు అండగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ తిట్టడానికి ఈ సభ పెట్టలేదని, తనకున్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచన అని స్పష్టం చేశారు.
Advertisement
“ఈ దేశం నాకు ఎందుకు సహకరించదు, ఎందుకు నా కోసం నిలబడదు అని ప్రతి సగటు మనిషిలోను కోపం ఉంటుంది. నేను కూడా అలాంటి సగటు మనిషినే. నాలోను అలాంటి ప్రశ్నలే తలెత్తాయి. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా గురించి నేను చేసిన పోరాటం అంటే తొలిప్రేమ నుంచి ఖుషి సినిమా వరకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడానికి నేను సిద్ధమని ప్రకటించారు. మీరు క్షేత్రస్థాయిలో బలం కలిగిస్తే నేను ఒంటరిగానే వెళ్తాను.. కుదిరితే పొత్తులు లేదంటే ఒంటరిగానే పోటీ.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని కోరారు పవన్ కల్యాణ్.
Advertisement
read also : వివాదంలో ‘వీరసింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !