Telugu News » Blog » విజయ్ వారసుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ ..మరి విజయ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఏదో తెలుసా…,?

విజయ్ వారసుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ ..మరి విజయ్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా ఏదో తెలుసా…,?

by AJAY
Ads

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. అంతే కాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా….టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

Advertisement

ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. జనవరి 12 న సినిమా విడుదల అవుతుండగా డిసెంబర్ 27 న. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే విజయ్ కూడా పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా కు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఆ సినిమా మరేదో కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా కు విజయ్ గెస్ట్ గా వచ్చారు. ప్రస్తుతం విజయ్ బంగారం సినిమా ఈవెంట్ కు వచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

You may also like