Home » Bheemla nayak : వికారాబాద్ లో పవన్ కళ్యాణ్ సందడి… కార్ నుండి దిగి…!

Bheemla nayak : వికారాబాద్ లో పవన్ కళ్యాణ్ సందడి… కార్ నుండి దిగి…!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ దానికి తగిన ప్లాన్ ను సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా ఏపీలో ఏ సమస్య వచ్చినా తనదైన రీతిలో ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.

Advertisement

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో రానా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. సినిమాలో ఇద్దరి మధ్య ఈగో వల్ల వచ్చే గొడవలు ఆ తర్వాత వచ్చే సమస్యల వల్ల జరుగుతుంది అన్నది చూపించనున్నారు. ఇక ఈ చిత్రంలో రానాకు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో పూర్తి చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం తాజాగా పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లా కు వెళ్లారు.

Advertisement

 

వికారాబాద్ జిల్లాలో మదనపల్లి రామాలయం వద్ద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారని సమాచారం. ఇక పవన్ వచ్చిన సంగతి తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ కారు నుంచి దిగి వారికి అభివాదం చేశారు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్ ప్లే ను అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading