Home » పవన్ కళ్యాణ్ – అనుష్క కాంబోలో మిస్ అయిన సినిమాలు.. చివరి టైంలో ట్విస్టులు ఏంటంటే..?

పవన్ కళ్యాణ్ – అనుష్క కాంబోలో మిస్ అయిన సినిమాలు.. చివరి టైంలో ట్విస్టులు ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోహీరోయిన్ల కాంబినేషన్ లు అభిమానులకు చాలా దగ్గరవుతాయి. దీంతో దర్శకుడు కూడా అభిమానులు ఆసక్తిని బట్టి తరచూ ఒకే హీరోయిన్ ను హీరో తో పలు సినిమాల్లో కూడా తీసుకుంటారు. ఈ విధంగా వచ్చిన కొన్ని కాంబినేషన్లు ఎంతో హిట్ అవుతాయి. అయితే ఇదే కాకుండా అభిమానులు కొన్ని వెరైటీ కాంబినేషన్లు కూడా కోరుకుంటూ ఉంటారు. వారితో కలిసి సినిమా చేస్తే బాగుంటుంది అని వారి ఒపీనియన్ అని అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటారు. కానీ అలాంటి కాంబినేషన్లు కలపడం ఒక్కోసారి మిస్ అవుతుంది. అన్ని ఓకే అనుకున్నా చివరికి ఏదో ఒక పరిణామం తో అది చేజారి పోతుంది.

Advertisement

మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కాంబినేషన్లతో ఒక్క సినిమా రాలేదు. అది ఎవరయ్యా అంటే అనుష్క. గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క ఇండస్ట్రీ లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరితో సినిమాలను చేసింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్ మరియు అనుష్క కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండేది. కానీ చివరి సమయంలో దర్శకుడు హీరోయిన్ పేరు మార్చడం తో అది కాస్త మిస్ అయింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సుస్వాగతం మూవీ వచ్చింది. ఇందులో దేవయాని హీరోయిన్ గా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

అలాగే ఈ దర్శకుడు పవన్ కలసి మరో సినిమా అన్నవరం కూడా చేశారు. ఈ సినిమా 2006 లో ఎన్టీఆర్ రాఖీ సినిమా కు పోటీగా రిలీజ్ అయింది. ఇది చెల్లి సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఇందులో పవన్ కు జోడీగా అసిన్ హీరోయిన్ గా నటించగా.. సంధ్యా హీరో చెల్లి గా నటించింది.. సంధ్య జోడిగా శివబాలాజీ నటించారు. అయితే ఈ సినిమాలో కూడా ముందుగా హీరోయిన్ అనుష్క ను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అంతకుముందు చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ చేయడంతో దర్శకుడు భీమనేని ఆమె స్థానంలో అసిన్ తీసుకున్నారట. వీరి కాంబినేషన్ రెండోసారి కూడా ఆగిపోయింది. ఈ విధంగా పవన్,అనుష్క కాంబినేషన్ లు సెట్ కాలేదు.

ALSO READ;

Visitors Are Also Reading