పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట లక్ష్మీ అనే మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం డేటింగ్ తర్వాత అకీరా కడుపులో ఉన్న సమయంలో పవన్ రేణు దేశాయ్ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులు ఇచ్చాడన్న సంగతి తెలిసిందే.
Advertisement
ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తీన్మార్ నటి అన్నా లెజనోవా ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అన్నా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. రష్యా కు చెందిన మహిళ అయినప్పటికీ అన్నా భారతీయ సాంప్రదాయాలను పాటిస్తూ చూడ చక్కగా కనిపిస్తుంటారు.
Advertisement
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ సతీమణి అయినప్పటికీ సోషల్ మీడియా కు చాలా దూరంగా సింపుల్ గా ఉంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే మీడియా ముందు కనిపిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ అన్నా లెజొనోవా ఎలా ప్రేమలో పడ్డారు…? ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది…? అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. కానీ వీరిద్దరి ప్రేమకు ఓ కారణం కూడా ఉందట.
తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి అన్నా లెజోనావాను కలుసుకున్నారు. మొదటి చూపులోనే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడిందట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చాలా మంచి మనసున్న వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. దానధర్మాలు చేయడంలో ఆయన తర్వాతే ఏ హీరో అయినా. ఇక అన్నా లెజొనోవా కు కూడా అలాంటి గుణమే ఉంటుందట. అలా ఇద్దరి అభిరుచులు కూడా కలవడం వారిద్దరి మధ్య ప్రేమకు కారణం అయ్యిందని పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెబుతుంటారు.