Home » హరిహర వీరమల్లు దర్శకుడిపై కోపానికి వచ్చిన పవన్.. సినిమా అగినట్టేనా..?

హరిహర వీరమల్లు దర్శకుడిపై కోపానికి వచ్చిన పవన్.. సినిమా అగినట్టేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలతోపాటు గా మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీని ఎలాగైనా గాడిలోకి తీసుకురావాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్నికల సమయం ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే, ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మధ్యనే పార్టీ అవసరాల కోసం ఎనిమిది కొత్త వాహనాలను కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే అక్టోబర్ నెలలో ఏపీలో పవన్ బస్సు యాత్ర కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒప్పు కున్నటువంటి సినిమాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మాత్రమే పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట, కానీ ఆ షూటింగ్ కూడా పూర్తయ్యేట్టు కనబడటం లేదు.

Advertisement

అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టువంటి హరిహర వీరమల్లు మూవీ రెండు సంవత్సరాలుగా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటికి పూర్తిచేయాలి. కొద్దిరోజులు కరోనా వల్ల వాయిదా పడింది. చివరికి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. ఈ తరుణంలోనే చిత్రంలో ఉన్నటువంటి కొన్ని సీన్లను పవర్ స్టార్ చెప్పినట్లు దర్శకుడు క్రిష్ మార్పులు చేయడం లేదట, దీంతో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరగడంతో, పవన్ దర్శకుడి పై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిన మార్పులు చేసే వరకు షూటింగ్ కు రానని తెగేసి చెప్పారట. దీంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగింది.

Advertisement

మరోవైపు పవన్ హీరోగా “వినోదయ సీతమ్” అనే మూవీ కూడా తెరకెక్కించనున్నారు. దీని కోసం పవన్ కళ్యాణ్ అక్టోబర్ వరకు సమయం ఇచ్చారు. ఈ సందర్భంలో హరిహర వీరమల్లు భవిష్యత్తు ఏంటనేది మాత్రం ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఈ తరుణంలో దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏఎం రత్నం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ నెల చివర్లో ఎలాగైనా కలిసి షూటింగ్ పై క్లారిటీ తీసుకోనున్నారని సమాచారం. ఒకవేళ షూటింగ్ ఇప్పుడు పూర్తి చేయకపోతే మరో రెండు సంవత్సరాల వరకు షూటింగ్ పూర్తి చేయలేరు. ఒకవేళ అదే జరిగితే మాత్రం నిర్మాతకు భారీగా నష్టం రావడం ఖాయం. మరి వీరు పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది.

ALSO READ:

సుధీర్-రష్మీల ప్రేమపై గెటప్ శ్రీను సంచలన కామెంట్స్..అందుకే జబర్దస్త్ వదిలేశారట..?

బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్.. అది ఏంటో తెలిస్తే మీరు షాకవుతారు..!!

Visitors Are Also Reading