Telugu News » Blog » నరేష్ తో నాలుగవ పెళ్లిపై వార్త‌లు వస్తున్న సమయంలో ..! పవిత్ర లోకేష్ మొదటి భర్త గురించి అలా చెప్పారా ?

నరేష్ తో నాలుగవ పెళ్లిపై వార్త‌లు వస్తున్న సమయంలో ..! పవిత్ర లోకేష్ మొదటి భర్త గురించి అలా చెప్పారా ?

by AJAY
Ads

పవిత్ర లోకేష్ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారిన పేరు. కన్నడలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన పవిత్ర లోకేష్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యారు. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ తమిళ, మలయాళ, భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవిత్ర లోకేష్ సినిమాలు చేస్తున్నారు. రాజా ది గ్రేట్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు తో సహా అనేక చిత్రాలలో పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. దాదాపు 300లకు పైగా సినిమాల్లో పవిత్ర లోకేష్ నటించారు.

 

తల్లిగా, అత్తగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే పవిత్ర లోకేష్ నటుడు నరేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పవిత్ర లోకేష్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి వార్తలను ఇప్పటికే నరేష్ పీఆర్ టీమ్ ఖండించినట్లు తెలుస్తోంది. మరోవైపు నరేష్ మాత్రం పెళ్లిపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవిత్ర లోకేష్ గతంలో తన భర్త పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవిత్ర లోకేష్ కు ఇప్పటికే కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. వీరిద్దరూ కొంతకాలంగా వేరు వేరుగా ఉంటున్నారు. కానీ అధికారికంగా విడాకులు మాత్రం తీసుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవిత్ర లోకేష్ గతంలో తన భర్త గురించి చెబుతూ… ఓ సీరియల్ లో నటిస్తున్న సమయంలో సుచేంద్ర పరిచయం అయ్యారని చెప్పారు.

ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా మారి 2007లో వివాహం చేసుకున్నామని అన్నారు. నా తో పోలిస్తే సురేంద్ర చాలా బెటర్ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఆయన చాలా మంచివారు… ఆయన లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేము. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా గుర్తించలేము. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ALSO READ :సమంత, నాగ చైతన్య బాటలో ఆ స్టార్ కపుల్ ? హేమ చంద్ర – శ్రావణ భార్గవిల విడాకుల వార్తలు…! నిజమేనా ?


You may also like