Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల నేతలకి అగ్నిపరీక్షగా మారిపోయాయి. ముఖ్యంగా కూటమి కట్టిన ప్రతిపక్ష పార్టీల్లో జనసేన నేతకే పరిస్థితి ఊహించని విధంగానే ఉంది. సీట్ల పంపకాల్లో రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గెలుపు ప్రెస్టీజ్ గా మారిపోయింది పవన్ కళ్యాణ్ ఫొటోస్ చూస్తున్న పిఠాపురం స్థానం అత్యంత కీలకంగా మారింది.
Advertisement
గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి ఈసారి గెలుపు చాలా అవసరం వైసిపి నాయకురాలు వంగా గీతా పేరు ప్రత్యేకంగా వినపడుతోంది. ఎందుకంటే వంగా గీతకి స్థానికతతో పాటుగా గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ ఉంది. పవన్ కళ్యాణ్ కి ఇది పెద్ద సవాలే.
పైగా వంగ గీతా సౌమ్యురాలు వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఆమెను ఈజీగా పిఠాపురం నియోజకవర్గం నుండి గెలిపిస్తాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ని ఢీ కొంటున్న వంగ గీత పొలిటికల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఎన్నికల్లో ఆమెకి కలిసి వచ్చే అంశాలు ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏ పోటీలో అయినా గెలుపు ఓటమిని నిర్ణయించడం కష్టం. కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పరిస్థితి కూడా అలానే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ గెలవడం పార్టీకి కూడా చాలా అవసరం. పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి అసెంబ్లీలో కాలు పెట్టలేకపోయారు. అప్పటినుండి కూడా బిజెపితో కలిసి గత ఐదు ఏళ్ల నుండి ప్రజల్లో ఉన్నారు.
Advertisement
Also read:
- Om Bheem Bush Review: ఓం భీమ్ బుష్ కథ, రివ్యూ అండ్ రేటింగ్..!
- ఉదయ్ కిరణ్తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
- HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?
ఎలాగైనా జగన్ ని ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో టిడిపి తో జతకట్టారు జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ హాట్ టాపిక్ అయింది. మహిళా అభ్యర్థితో ఓడించాలని కంకణం కట్టుకుంది వైసిపి. ఏపీ రాజకీయాల్లో వంగ గీతా పేరు పరిచయం చెయ్యక్కర్లేదు. న్యాయ శాస్త్రంలో పట్టభద్రురాలు. పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ ని పూర్తి చేశారు. వంగా కాశీ విశ్వనాధ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పటిదాకా జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో పదవులు చేపట్టారు ఇప్పటిదాకా ఓటమి ఎరుగని నాయకురాలుగా వంగ గీతకి పేరు కూడా ఉంది. పిఠాపురంలో ఆమె బంధు వర్గం ఎక్కువ ఉండడంతో ప్లస్ అయ్యే అవకాశం ఉంది లక్ష కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నప్పటికీ 30 నుండి 40% ఓట్లు పడిన మిగతా 1,20,000 ఓట్లలో ఎక్కువగా ఉన్న బీసీ ఎస్సీ ఓటర్లు జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలను పొందిన వాళ్ళు కనుక 70 వేలకి పైగా ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్ పై సునాయసంగా గెలుస్తారని అంచనాలు ఉన్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!