Home » బ్రో సినిమా టైం లో నన్ను దారుణంగా తిట్టారు: పవన్ కళ్యాణ్

బ్రో సినిమా టైం లో నన్ను దారుణంగా తిట్టారు: పవన్ కళ్యాణ్

by Sravya
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. హీరోగా మంచి సక్సెస్ ని అందుకున్న విషయం మనకి తెలుసు. అయితే ఒకపక్క సినిమాలు చేస్తూ ఇంకోపక్క రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రెండిటితో ఫుల్ బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఏపీలో పోటీ చేయడానికి రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికల మీదే పూర్తి ఫోకస్ ని పెట్టారు. సినిమాలకి బ్రేక్ కూడా ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారు.

Advertisement

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. రాజకీయాల మీద ఎంతో ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా టైంలో చాలామంది నన్ను ఎక్కువగా తిట్టారని అన్నారు. సాధారణంగా నేను గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించను. ఒకవేళ గ్రాఫిక్స్ సరిగా లేకపోతే ఎక్కడ దొరికిపోతామో అన్న భయం నాకు ఎక్కువ ఉంటుంది అని అన్నారు. అందుకే సినిమాల్లో గ్రాఫిక్స్ వాడమని చెప్పారు పవన్ కళ్యాణ్. బ్రో సినిమాలో మేము గ్రాఫిక్స్ వాడాము అందుకని చాలామంది నన్ను తిట్టారు ఆ తిట్లని కూడా నేను పడ్డాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

ఇటీవల పార్టీ సభకి గ్రాఫిక్స్ లో జనాలు క్రియేట్ చేశారు అని ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ నాకు సినిమాల్లోని గ్రాఫిక్స్ వాడడం ఇష్టం లేదు అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈసారి రాజకీయాల్లో బాగా రాణించాలని కచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లిస్టులని కూడా బయటపెట్టారు. అలానే తాను ఎక్కడినుండి పోటీ చేయబోతున్నారు అనే అంశాలను కూడా వివరించారు మరి ఈసారైనా పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో ఎంతవరకు కలిసి వస్తుందనేది చూడాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading