ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-2023 ఫైనల్లో ఆస్ట్రేలియాను విజయపథంలో నడిపించడం ద్వారా అతను మొదట అసాధారణమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించినందున, 2023 అనేది ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమ్మిన్స్‌కు చాలా మైల్ స్టోన్స్ ను కలిగిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఒప్పందాన్ని సాధించి, మైదానం వెలుపల కూడా కమిన్స్ పాపులర్ అవుతున్నారు.
Advertisement
IPL వేలం 2024లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ సేవలను 20.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ చర్య కమిన్స్ మార్కెట్ విలువను పెంచిందని చెప్పొచ్చు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ సన్‌రైజర్స్ జట్టులో అతని పాత్ర గురించి ప్రశ్నలను అడిగారు. రాబోయే IPL సీజన్లో ఫ్రాంచైజీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారా? ప్యాట్ కమిన్స్ ఎస్ ఆర్ హెచ్ జట్టుకి కెప్టెన్ గా ఉండబోతున్నారా? అని ప్రశ్నించారు.
Advertisement
మరోవైపు క్రికెట్ అభిమానుల్లో కూడా చాలా చర్చలే జరుగుతున్నాయి. వరల్డ్ కప్ విన్నర్ అయిన కమ్మిన్స్ కు సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనీ.. అందుకే అంత ఖర్చు చేసి మరీ ఎస్ ఆర్ హెచ్ కొనుగోలు చేసిందని భావిస్తున్నారు. కమిన్స్ టీం లీడర్ గా ఉండి ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలను అందించాడు. అందుకే ఎస్ ఆర్ హెచ్ పెద్ద స్కెచ్ వేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే అతన్ని ఎస్ ఆర్ హెచ్ కు కెప్టెన్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.