గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సన్రైజర్స్ ఈ ఏడాది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. పర్సులో ఉన్నది తక్కువ అయినప్పటికీ తనదైన స్ట్రాటజీతో వేలంలోకి అడుగుపెట్టింది. 34 కోట్ల ప్రైస్ మనీతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ బెటోరి, స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కలిసి ఆక్షన్ లో దూకుడుగా వ్యవహరించారు. గత సీజన్ లో చివరిస్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈ ఏడాది టైటిల్ లక్ష్యంగా ముందుకు వెళుతోంది. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో సన్రైజర్స్ స్ట్రాటజీ ప్రకారం ఆటగాళ్ళను కొనుగోలు చేసింది.
Advertisement
అయితే మొదటినుంచి ఓవర్సీస్ స్టార్ ప్లేయర్లపై ఆధారపడుతున్న సన్రైజర్స్ ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. గత సీజన్ లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లను పక్కనపెట్టింది. ఈ క్రమంలో రేటు ఎక్కువైనా స్టార్ ఆటగాళ్లను దక్కించుకుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను ఏకంగా 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రపంచ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ 6.80 కోట్లకే దక్కించుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ హసరంగను కోటిన్నరకే కొనుగోలు చేసింది. ఈ ముగ్గురి కోసమే సన్రైజర్స్ 28.8 కోట్లను ఖర్చుపెట్టింది. మరి SRH ఫుల్ స్క్వాడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
అబ్దుల్ సమాద్, రాహుల్ త్రిపాటి, ఐడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్ ప్రీత్ సింగ్, హెన్రిచ్, నితీష్ కుమార్ రెడ్డి, హ్యరిబ్రోక్, మయాంక అగర్వాల్,మార్కో జాన్సన్, అభిషేక్ శర్మ, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయాంక్ అగర్వాల్, ఉపేందర్ సింగ్ యాదవ్ , ఉమ్రాన్ మాలిక్, శాబాజ్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి, ఫారూకి, ఫజల్ ఉండగా కొత్తగా వేలంలో ఉన్న ఆటగాళ్లు ఫ్యాట్ కామిన్స్, ట్రావిస్ హెడ్, హసరంగా, జయదేవ్ ఉనద్కట్, ఆకాష్ సింగ్, సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. కాగా ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను అద్భుతంగా ముందుండి నడిపించిన ఫ్యాట్ కమిన్స్ జట్టు కెప్టెన్ గా ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.