Home » ఐపీఎల్ చరిత్ర లోనే రికార్డ్ ధర….. ప్యాట్ కమిన్స్ ని దక్కించుకున్న సన్‌రైజర్స్‌…!

ఐపీఎల్ చరిత్ర లోనే రికార్డ్ ధర….. ప్యాట్ కమిన్స్ ని దక్కించుకున్న సన్‌రైజర్స్‌…!

by Sravya
Ad

ఐపీఎల్ 2024 సీజన్ వేలం లో సరి కొత్త రికార్డు ని ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హిస్టరీ ని క్రియేట్ చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్ర లోనే ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా కమిన్స్ నిలిచాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ ని రూ. 20.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. రెండు కోట్ల బేస్ ప్రైస్ తో వేలం లోకి వచ్చిన ప్యాట్ కమిన్స్ కోసం హైదరాబాద్ జట్టు అలానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య గట్టి పోటీ నడిచింది.

Advertisement

ఇరు ఫ్రాంచైజ్ లు పోటీపడి కమిన్స్ ని కొనడానికి ప్రయత్నం చేశారు చివరికి హైదరాబాద్ రూ.20.50 కోట్ల భారీ ధర కి సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. గత సీజన్లో అత్యధిక ధర రూ.18.5 కోట్లు కి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కిరణ్ అమ్ముడై రికార్డ్ ని క్రియేట్ చేస్తే ఇప్పుడు ఏకంగా దానిని దాటేశాడు కమిన్స్.

Advertisement

ఐపీఎల్ 2020 సీజన్లో కమిన్స్ కి 15.5 కోట్లు కి పలకగా అప్పుడు కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా 20 కోట్ల కి కమిన్స్ ని దక్కించుకున్నారు. 2020 సీజన్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ధర కి కొనుగోలు చేయడం జరిగింది. ఐపీఎల్ 2022 వరకు కేకేఆర్ టీం లో ఆడాడు పాట్ కమిన్స్. వన్డే ప్రపంచ కప్ కోసం గత సీజన్ ఐపీఎల్లో ఆడలేదు. ఇప్పటి వరకు 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు 45 వికెట్ల తో 379 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ గెలవడం తో బాగా కలిసి వచ్చింది ప్యాట్ కమిన్స్ కి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading