పదవతరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నిరుత్సాహ పడకుండా ప్రోత్సహించేందుకు ఓ ఐఏఎస్ అధికారి తన పదవతరగతికి సంబంధించిన మార్కుల మెమోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ మార్కుల షీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌లోని భరూచ్ జిల్లా కలెక్టర్ తుషార్ డి సుమేరా 10వతరగతి ఫలితాలలో ఉత్తీర్ణత మార్కులను మాత్రమే సాధించారు.
Advertisement
అతనికి ఇంగ్లీషులో 35, గణితంలో 36 మార్కులు మాత్రమే వచ్చాయి. ఛత్తీస్‌గడ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ రిపోర్ట్ కార్డుతో పాటు ఆయన ఫోటోను జత చేసి ట్విట్టర్లో షేర్ చేసారు. ముఖ్యంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకనగా కరోనా సమయంలో విద్యాబ్యాసం కొనసాగకపోవడంతో విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి ఫలితాలు వస్తాయోనని టెన్షన్‌కు గురవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను బోర్డు ఫలితాలు నిర్ణయిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే.
బోర్డు పరీక్ష ఫలితాలు విద్యార్థి కెరీర్‌లో కీలక పాత్ర పోషించినప్పటికీ భవిష్యత్‌ను నిర్ణయించదని ఈ న్యూస్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కేవలం మార్కులతో విద్యార్థిలో ఉన్న ప్రతిభను నిర్ణయించుకోవడం కష్టం అని తెలుస్తుంది. పదవతరగతిలో మార్కులు తక్కువ వచ్చినంత మాత్రానా.. భవిష్యత్ బాగుండదు అని అనుకోవడం పొరపాటేనని.. ఈ కలెక్టర్ మార్కుల షీట్ చూస్తేనే ఇలా తెలిసిపోతుంది. తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మార్కులు ఉంటే ముందు ముందు మంచి మార్కులతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేది అర్థమవుతుంది. పదోతరగతి పరీక్షలో ఓ ఐఏఎస్ సాధించిన మార్కులను చూస్తే ఈ మాటలు నమ్మక తప్పదు. అప్పట్లో మార్కులు చూసి తాను విజయం సాధించలేదని అప్పుడే అనుకుని ఉంటే గుజరాత్‌లో కలెక్టర్‌గా ఉండేవాడినే కాదని చెప్పుకొచ్చారు.
Advertisement
भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.
उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I
— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022
తన మార్కుల షీట్‌ను పంచుకుంటూ.. భరూచ్ కలెక్టర్ తుషార్ సుమేరా మాట్లాడుతూ ముఖ్యంగా తాను పదవతరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను మాత్రమే సాధించాను. మొత్తం 100 మార్కులకు ఇంగ్లీషులో 35, గణితంలో 36 మార్కులే మాత్రమే సాధించగలిగాను. ప్రస్తుతం ఈ కలెక్టర్ టెన్త్ మార్కుల షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఈ మార్కులను చూసి.. అతని ప్రాంతంలోని ప్రజలు మాత్రమే కాకుండా పాఠశాలలో కూడా తన జీవితంలో పైకి రాలేడని చాలా మంది అన్నట్టు ఇందులో వివరించాడు. కానీ సైన్స్‌లో 100కి 38 మార్కులు తెచ్చుకున్న ఈ కలెక్టర్ ఆ ఊరి మొత్తానికే కాదు.. ఆ పాఠశాలలో ఉన్న వారందరికీ సరైన సమాధానం చెప్పాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొనడం గమనార్హం.
Also Read :
ఎన్టీఆర్ కోసం అప్పట్లో కృష్ణ ఇచ్చిన పేపర్ ప్రకటన గురించి తెలుసా..?
సూర్యవంశం మూవీని తలపిస్తున్న రియల్ స్టోరీ.. భార్యను కలెక్టర్ చేయడానికి భర్త ఎంత కష్ట పడ్డారంటే..?