Ad
క్రికెట్ లో ఫామ్ కంటే క్లాస్ అనేది పరిమితం అంటూ కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఇక ఏ ఆటగాడికి అయిన క్రికెట్ లో ఫామ్ పోవడం అనేది మాములు విషయం. ప్రతి క్రికెటర్ ఏదో ఒక సమయంలో తన ఫామ్ ను కోల్పోయి.. పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతాడు. ఇక అలంటి సమయంలో అతనిపై ఫ్యాన్స్ నుండి విమర్శాలు అనేవి వస్తుంటాయి.
కానీ అప్పుడే ఆ ఆటగాడికి కెప్టెన్ తోడుగా ఉండాలి. అలా ఉంటేనే అతను మళ్ళీ ఫామ్ లోకి రాగలుగుతాడు. లేదంటే చాలా కష్టం. అయితే ఇప్పుడు ఇండియా జట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లతో వ్యవరించే తీరును.. మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ వివరించాడు. రోహిత్ ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లతోనే ఎక్కువ సమయం అనేది గడుపుతాడు అని పార్థివ్ పటేల్ చెప్పాడు.
ఇది నాకే జరిగింది. రోహిత్ కెప్టెన్సీలో 2016 లో ఆడిన ఐపీఎల్ సీజన్ లో నేను ఫామ్ కోల్పోయాను. అప్పుడు రోహిత్ ఆ సీజన్ లో నాతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. సంకు సపోర్ట్ గా నిలిచాడు. అందుకే తర్వాతి రెండు సీజన్లలో నేను బాగా పరుగులు చేశాను. ఇక ఫామ్ లో ఉన్న ఆటగాడితో రోహిత్ ఎక్కువ సమయం గడపాడు. సరిగ్గా మాట్లాడాడు కూడా. ఒక్క కెప్టెన్ కు ఉండాల్సిన అసలైన లక్షణం ఇదే అని పార్థివ్ పటేల్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
దేశం కోసం ప్రపంచ కప్ కు వస్తున్న జయవర్థనే..!
ఫాలో ఫాలో ఫాలో అంటూ పంత్ వెనుక ఆసీస్ వెళ్లిన ఊర్వశీ..!
Advertisement