Home » పార్లమెంట్ క్యాంటీన్ లో ఏమేమి దొరుకుతాయి..? వాటి ధరలు ఎంత అంటే…?

పార్లమెంట్ క్యాంటీన్ లో ఏమేమి దొరుకుతాయి..? వాటి ధరలు ఎంత అంటే…?

by Sravya
Ad

ప్రత్యేక సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలో మొదలయ్యాయి. పార్లమెంట్ గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి క్యాంటీన్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. పార్లమెంట్ క్యాంటీన్ లో చౌక ధరలకే ఆహార పదార్థాలు దొరుకుతాయి అని సోషల్ మీడియాలోఅంటూ వుంటారు. పార్లమెంట్ క్యాంటీన్ లో ఏ ఆహారం ఎంతకు దొరుకుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2021లో క్యాంటీన్ రేట్లు ని మార్చింది. దీంతో కొన్ని ఆహార పదార్థాల యొక్క రేట్లు పెరిగాయి.

Advertisement

Advertisement

గతంలో చపాతి రెండు రూపాయలు ఉంటే దానిని మూడు రూపాయలకు మార్చారు. అలానే మిగిలిన వంటకాల ధరలు కూడా పెరిగాయి. ఇక పార్లమెంట్లో ఏ ఆహార పదార్థాలు ఎంతకు దొరుకుతాయి అనే విషయానికి వచ్చేస్తే… ఆలు బోండా 10 రూపాయలు, చపాతి 3 రూపాయలు, పెరుగు 10 రూపాయలు, దోసె 30, లెమన్ రైస్ 30, మటన్ బిర్యానీ 150, మటన్ కర్రీ 125, ఆమ్లెట్ 20, కీర్ 30, ఉప్మా 25, సూప్ 25, సమోసా 10, కచోరి 15, పన్నీర్ పకోడా 50 కి పార్లమెంట్ క్యాంటీన్లో దొరుకుతాయి.

Also read:

Visitors Are Also Reading