Home » స్వాతంత్ర్య ఉద్య‌మంలో PARLE-G బిస్కెట్లు!

స్వాతంత్ర్య ఉద్య‌మంలో PARLE-G బిస్కెట్లు!

by Azhar
Ad

అది 1929వ సంవ‌త్స‌రం.స్వ‌దేశీ ఉద్య‌మం జోరుగా సాగుతున్న కాలం. విదేశీ వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రిస్తున్న త‌రుణం….ఆ స‌మయంలో ఇండియాలో దొరికే బిస్కెట్ల‌న్నీ బ్రిట‌న్ కు చెందిన‌వే…. యునైటెడ్, హంట్లీ పామ‌ర్స్‌, బ్రిటానియా, గ్లాక్సో ఇవ‌న్నీ బ్రిట‌న్ కంపెనీలే! మ‌న‌కంటూ ఓసొంత బ్రాండ్ ఉండాల‌ని ముంబైకి చెందిన సిల్క్ వ్యాపారి మోహ‌న్‌లాల్ ద‌యాల్ జ‌ర్మ‌నీకి వెళ్లి అక్క‌డ బేక‌రీ వ‌స్తువుల‌ను ఎలా త‌యారు చేస్తారో నేర్చుకొని 60వేల వెచ్చించి ఆ యంత్రాల‌ను ఇండియాకు తీసుకొచ్చారు.

అలా ఇండియాకు వ‌చ్చిన మోహ‌న్‌లాల్ ముంబైలోని ఇర్లా అండ్ పార్లా అనే ప్రాంతంలో చిన్న ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేశారు. దీంట్లో మోహ‌న్ లాల్ ఫ్యామిలీకి చెందిన 12 మంది ప‌నిచేసేవారు.మొద‌ట క్యాండీల‌ను త‌యారుచేసిన ఈ కంపెనీ 10 ఏళ్ల త‌ర్వాత అంటే 1939లో బిస్కెట్ల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించింది. దీంతో ఆ ఫ్యాక్ట‌రీ ఉన్న ఆ పార్లా ప్రాంతం పేరే పార్లే బిస్కెట్లుగా మారింది.

Advertisement

Advertisement


నాణ్య‌త మంచిగా ఉండ‌డం, త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం, స్వ‌దేశీ బ్రాండ్ నే వాడాల‌ని ప్ర‌జ‌లు కోరుకోవ‌డంతో అన‌తికాలంలోనే పార్లే బిస్కెట్ల‌కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అటు త‌ర్వాత బ్రిటానియా గ్లూకోజ్ పేరుతో కొత్త బిస్కెట్ల‌ను మార్కెట్ లోకి వ‌ద‌ల‌గా పార్లే కూడా గ్లూకోజ్ బిస్కెట్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డం ప్రారంభించింది. దీంతో పార్లే కాస్త పార్లే-జీ అయ్యింది. జీ అంటే జీనియ‌స్ కాదు గ్లూకోజ్!

అంకెల్లో పార్లే-జీ :

  • ఏటా 14,600 కోట్ల వ‌ర‌కు బిస్కెట్ల‌ను పార్లె ఉత్ప‌త్తి చేస్తుంది. వాటిని దేశంలో ఉన్న జ‌నాలు అంద‌రికీ పంచితే మ‌నిషికి 121 బిస్కెట్లు వ‌స్తాయి.
  • ఒక ఏడాదిలో త‌యార‌య్యే బిస్కెట్ల‌ను లైన్‌గా పేరిస్తే భూమిని 192 సార్లు చుట్టి రావ‌చ్చు.
  • 13 బిలియ‌న్ల పార్లె జి బిస్కెట్ల త‌యారీకి వాడే 16,100 ట‌న్నుల చ‌క్కెర‌ను వాటిక‌న్ సిటీ న‌గ‌రం మొత్తం పేర్చ‌వ‌చ్చు.
  • ఒక నెల‌లో త‌యారయ్యే పార్లె జి బిస్కెట్ల‌ను ఒక‌దాని ప‌క్క‌న ఒక‌టి పేరిస్తే భూమి నుంచి చంద్రునికి వెళ్ల‌వ‌చ్చు.
Visitors Are Also Reading