టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే నాగార్జున కుమారుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత కొంత కాలానికే విడాకులు తీసుకున్నారు. వీరు విడాకులు ప్రకటించినప్పటికీ ఇద్దరూ కూడా సినిమాల్లో బిజీగానే ఉన్నారు.
Advertisement
ముఖ్యంగా సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ కాళిదాస్ నటించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా రూపొందింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పై తాజాగా రచయిత పరిచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Advertisement
“శాకుంతలం” చిత్రం తనకు ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఈ పాత్రలో సమంత చాలా అద్భుతంగా నటించారు. గుణశేఖర్ రాసిన కథ, తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. కానీ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంతోనే ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. విభిన్నమైన ఐడియాలజీ ఉన్న దర్శకుడు, రచయిత గుణశేఖర్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు కథలో లేని కొన్ని సన్నివేశాలు చేర్చారు. ఫస్టాప్ లో శకుంతల, దుష్యంతులు కలుస్తారా ? లేదా అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. కానీ సెకండాఫ్ లో ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుకు గతం గుర్తుకు రావడంతో వారిద్దరూ కలిసి పోతారని చిన్నపిల్లాడికి తెలిసిపోయేలా అనిపించింది. ఓవరాల్ గా సెకండాఫ్ లో కొన్ని సీన్ల కారణంగానే సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించి ఉండవచ్చని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాల్ కృష్ణ.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వర్మ జేడీ చక్రవర్తి ఇద్దరు ఒకే హిరోయిన్ ని ప్రేమించారా..?
వంటలక్క బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా..ఆమె పేరుపై వందల కోట్ల ఆస్తులు !