భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన పూర్తి చేసుకుంది. నిన్న ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ముందే వన్డేతో ఈ టూర్ అనేది పూర్తయింది. ఇక మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో ఇండియా, ఇంగ్లాండ్ ఒక్కే విజయం సాధించగా.. నిన్న జరిగిన చివరి వన్డే వన్డే చాలా కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 45.5 ఓవర్లలోనే ఆల్ ఔట్ అయ్యింది. పాండ్య, చాహల్, సిరాజ్, జడేజా కలిసి కట్టడి చేయడంతో ఇంగ్లాండ్ 259 పరుగులు చేయగలిగింది.
Advertisement
ఆ తర్వాత 260 పరుగుల టార్గెట్ లో వచ్చిన టీం ఇండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు అందరూ త్వరగా ఔట్ కాగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే పాండ్య జట్టును ఆదుకున్నారు. పాండ్య 71 పరుగులు చేసి ఔట్ కాగా.. పంత్ సెంచరీతో చెలరేగిపోయి 125 పరుగులు చేసి జట్టుకు విజయంతో పాటుగా సిరీస్ ను కూడా అందించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ యొక్క హైలెట్స్ ను యూట్యూబ్ లో పెట్టింది. కానీ అది చూసిన తర్వాత మాత్రం భారత అభిమానులు.. ఇంగ్లాండ్ బోర్డుపై విరిచుకపడుతున్నారు. ఎందుకంటే… ఈ మ్యాచ్ 42వ ఓవర్ లో సెంచరీ తర్వాత పంత్.. విల్లీ బౌలింగ్ లో వరుసగా 5 పొర్లు అనేవి కొట్టాడు.
Advertisement
అయితే దీనికి సంబంధించిన క్లిప్స్ ను అందులో ఉంచలేదు. పైగా.. ఆ ఓవర్ చివరి బంతికి పంత్ సింగిల్ తీసింది మాత్రమే… ఆ వీడియోలో ఉంచింది. దాంతో ఫ్యాన్స్ ఇంగ్లాండ్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇంతకముందు జరిగిన 5వ టెస్టులో కూడా.. పంత్ సెంచరీ చేస్తే.. టైటిల్ అనేది అది ఇవ్వకుండా.. పంత్ ను రూట్ ఔట్ చేసాడు అంటూ పెట్టారు. అప్పుడు దినేష్ కార్తీక్ కూడా దీనిని ప్రశ్నించాడు. ఇక ఇప్పుడు మరోసారి ఇంగ్లాండ్ బోర్డు పంత్ విషయంలో తన వక్ర బుద్ధి అనేది చూపించిందని ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :