రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ ను చేయడం రోహిత్ ఫ్యాన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఐదుసార్లు ట్రోఫీని అందించిన రోహిత్ ను ముంబై ఇండియన్స్ పక్కన పెట్టడాన్ని ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో హార్దిక్ వర్సెస్ రోహిత్ ఫ్యాన్స్ వార్ నడుస్తోంది. హార్దిక్ క్యాష్ అండ్ ట్రేడ్ ద్వారా గుజరాత్ నుంచి ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Advertisement
ఓ దశలో రోహిత్ ముంబైని వీడనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ముంబైని వీడింది రోహిత్ కాదు, హార్దిక్ ముంబైని వీడనున్నాడు. విషయమేంటంటే వచ్చే ఐపిఎల్ సీజన్ కు పాండ్యా దూరం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సీజన్ కు హార్దిక్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. గాయం నుంచి పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టి20 సిరీస్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఐపీఎల్ సీజన్ కు సైతం పాండ్యా అందుబాటులో ఉండడనే సమాచారం. దీంతో రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. కర్మ అంటే ఇదే అంటూ రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా….టీమిండియా ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటం కలవరపెడుతుంది. ఇప్పటికీ పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో వరుసగా టోర్నీలకు దూరం అవుతున్నారు.
Advertisement
తాజాగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ గెలిపించిన సూర్య కుమార్ యాదవ్, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వంటి వారు జట్టుకు దూరం కాగా…. ఇప్పుడు రాబోయే సిరిస్ లకు కీలక ఆటగాళ్లుగా భావిస్తున్న వారు కూడా జట్టుకు దూరం కానున్నారు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు తదుపరి సిరీస్ లకు కూడా దూరమయ్యేలా కనిపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మరియు ఐపీఎల్ లాంటి కీలక టోర్నీలకు ఆయన అందుబాటులో ఉంటాడని స్పష్టం అవుతుంది.