తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం అంటే ఉగాదికి మొదలవుతుంది. ఇది కొత్త ఆశను సూచిస్తుంది మరియు వాతావరణం నెమ్మదిగా వ్యవసాయానికి అనుకూలంగా మారుతుంది. కాటన్ ధోతీలతో కూడిన క్లాసిక్ తెలుగు పంచెకట్టు మరియు తెలుపు రంగు కాటన్ షర్టులు లేదా లాల్చీలు వేసవిని అధిగమించడానికి సరైన మార్గం అంటారు. అసలు తెలుగు పంచెకట్టు విషయానికి వస్తే పంచెకట్టును హైలైట్ చేసింది మరెవరో కాదు అన్నగారు ఎన్.టి.రామారావు. ఆయన పంచెకడితే తెలుగు దనం ఉట్టిపడుతుంది. మంచి లక్షణాలు, యవ్వనంలో సౌష్టవమైన శరీరాకృతి, నిలువెత్తు రేఖ రూపంలో ముఖంపై ధరించే వెర్మిలియన్ అన్నీ ఆయన్ని మరింత చూసేలా చేసేవి. ఆ తర్వాత ఎన్టీఆర్ యొక్క సమకాలీనుడైన అక్కినేని నాగేశ్వరరావుతో పాటు, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ స్టైల్‌ని పెంచాడు అనే చెప్పాలి. వీళ్ళు ధరించడం వల్ల సంప్రదాయ దుస్తులకు మరింత ఆదరణ పెరిగిందని చెప్పాలి.
Also Read: థియేటర్లు ఫుల్…. కలెక్షన్లు నిల్!
Advertisement
ప౦చె కట్టుట లొ ప్రప౦చాన మొనగాడు క౦డువాలేనిదే గడపదాటనివాడు ప౦చబక్ష్యాలు తన క౦చాన వడ్డి౦చ
గో౦గూర కొసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడుఇ౦కెవడయ్య తెలుగువాడు అని సి.నారాయణరెడ్డి అన్నారు.
Advertisement
ఈ రోజుల్లో పంచెకట్టు అంటే పండుగల సమయంలో, అలాగే ఏదైనా ఫంక్షన్లలో తప్పదు అంటే పంచకడుతున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో మహేష్ బాబు, ప్రభాస్ తదితరులంతా సినీ ప్రియుల ఊహల్లోకి ఎక్కారు. కానీ ఈ రోజుల్లో ఈ దుస్తులు సరైన ఫ్యాషన్ లేదా రోజువారీ దుస్తులు కంటే మాస్ అప్పీల్‌ను పెంచడానికి ఈ పంచె కడుతున్నారు. దాదాపు హీరోలందరూ పంచె కట్టినవాళ్ళే. ఇప్పుడు హీరోలే కాదండోయ్ కొంత మంది స్టైల్ కోసం కొన్ని సినిమాల్లో సాంగ్స్‌లో వెరైటీ కోసం హీరోయిన్లు కూడా పంచెలు కట్టేస్తున్నారు. రష్మిక మండన్న మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో పంచెకట్టింది. అలాగే విజిలేస్తే సోడా బుడ్డి అనే పాటలో భూమిక, అంకిత, అమ్మానాన్న తమిళ్ అమ్మాయిలో ఆశిన్, శృతి హాసన్, తమన్నా, మెహ్రీన్ వీళ్ళందరూ కూడా సాంగ్స్ లో పంచెలు కట్టి ఓ డిఫరెంట్ ట్రెండ్‌ని సృష్టించారు.
Also Read: అన్నయ్య, శంకర్ దాదా సినిమా తర్వాత మళ్లీ చిరుతో జతకట్టనున్న రవితేజ!