Home » మీరు పంచతంత్రం ట్రైలర్ చూశారా..? ఎలా ఉందంటే ?

మీరు పంచతంత్రం ట్రైలర్ చూశారా..? ఎలా ఉందంటే ?

by Anji
Ad

డాక్టర్ బ్రహ్మనందం, కలర్స్ స్వాతి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల కీలక పాత్రల్లో నటిస్తొన్న యాంథాలజీ పంచతంత్రం. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజ‌న్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 09న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement

తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసి.. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఇక ట్రైలర్ ని చూసినట్టయితే.. ఇది 5 జంటలు సంబంధించిన కథ అని స్పష్టంగా అర్థమవుతోంది. బ్రహ్మానందం 5 కథలకు పంచేంద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ చేస్తారని ట్రైలర్ ని చూస్తే తెలుస్తోంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లుంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. ఎంత బాధ్యతగా మన పనులను పూర్తి చేస్తూ ముందుకెళ్లాం అనేది కథాంశం అని క్లియర్ గా తెలుస్తోంది. 

Advertisement

manam News

ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాలజీని దర్శకుడు ఎలా ట్రీట్ చేశారనే ఎగ్జయిట్ మెంట్ కలుగుతుంది. ట్రైలర్ చూస్తుంటే.. మనకు తెలియని  అదో ఫీలింగ్ కలుగుతోంది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అద్భుతమనే చెప్పాలి.  ముఖ్యంగా సినిమాని తెరపై ఎప్పుడూ చూడాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. సినిమా చూడడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 

Also Read :  భానుప్రియ చెల్లెలి జీవితంలో ఇంత విషాదం ఉందా..? ఏం జ‌రిగిందంటే..?

Also Read :  అత‌డు సినిమా క‌థ‌ను త్రివిక్ర‌మ్ నాగార్జున న‌టించిన ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా నుండి లేపేశాడా..? ఆ సినిమా ఏదంటే..?

Visitors Are Also Reading