పల్లవి ప్రశాంత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు పల్లవి ప్రశాంతి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అప్పటి నుండి బయటికి వచ్చి ఎంతవరకు కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు పల్లవి ప్రశాంత్ పబ్లిక్ న్యూసెన్స్, ప్రభుత్వాస్తులు ధ్వంసం కేసులులో అరెస్టు అయిన విషయం మనకి తెలుసు ఈ కేసుకు సంబంధించిన నాంపల్లి కోర్టులో వాదనలు కూడా ముగిసాయి. పల్లవి ప్రశాంత్ కి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేశారు. అయితే పల్లవి అరెస్ట్ పై తన కుటుంబం ఆవేదనకి గురి చేసింది పల్లవి ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Advertisement
కొడుకుని అరెస్ట్ చేసి మాకు సంతోషం లేకుండా చేశారని చెప్పారు కుమార్ల అరెస్టుతో తన భార్య ఏడుస్తోందని చెప్పారు నా కొడుకు బిగ్ బాస్ గెలిచాడు అని మురిసిపోయాను. నాకు బాధ అనిపించింది. నాకు ఇదంతా అవసరమా వ్యవసాయం చేసుకుంటే సరిపోయేది అనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండేది లేనిపోని వాటిని సృష్టించి వార్తలు రాస్తున్నారు. ప్రశాంత్ పక్కనే నేను ఉన్నాను నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం కూడా లేదు అని వెల్లడించారు.
Advertisement
బుధవారం సాయంత్రం 6:30 నిమిషాలకి పోలీసులు వచ్చి పల్లవి ప్రశాంత్ ని తీసుకువెళ్లిపోయారు. మాది మారుమూల గ్రామం. ఇలాంటివన్నీ కూడా మాకు తెలియదు. నా భార్యకి ఆరోగ్యం బాలేదు. ఏడుస్తూ ఉంటోంది. జ్వరం కూడా వచ్చింది మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు పెట్టారు సార్. బట్టలు మార్చుకుంటాను అంటే కూడా వినలేదు ముందు మంచిగానే మాట్లాడారు ఒక ఆయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులు పెట్టి నొక్కేశారు వారెంట్ ఇవ్వలేదు. దొంగతనం చేసినట్లు పల్లవి ని తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒకటే వేడుకుంటున్నాను నా కొడుకు దొంగ కాదు అని పల్లవి ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!