విజయదశమి సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గగా పూజించి… దశమినాడు అపరాధిత దేవిని రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. దసరానాడు గ్రామ శివారు దాటి, ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దసరా పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటారు.
Advertisement
దసరా పండుగ రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. నీలం, పసుపు రంగుల కలయికలో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయాలకు ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించుకోవడం వెనుక కొన్ని కథనాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం… రావణుడితో యుద్ధానికి బయలుదేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెబుతారు. అలాగే అజ్ఞాతవాసం ముగించిన పాండవులు విజయదశమి రోజున జమ్మిచెట్టును పూజించి దానిపై ఉంచిన ఆయుధాలను తీసుకున్న తరుణంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని కథనాలలో ఉంది.
Advertisement
త్రేతాయుగంలో శ్రీరామునికి, ద్వాపర యుగంలో పాండవులకు పాలపిట్ట దర్శనమిచ్చిన అనంతరం విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈమెకు దసరా రోజున విజయోత్సహనికి సూచికగా శమి వృక్షాన్ని పూజించి పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తోంది. ఇక దసరా రోజున ప్రజలు ఎంతో ఆనందంగా పండుగను జరుపుకొని జమ్మి పెట్టుకుంటారు. బంధువుల ఇంటికి వెళుతూ ఉంటారు.
మరిన్ని Telugu news మరియు తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చదవండి !