పాకిస్తాన్ క్రికెట్ కి ఇబ్బందులు తప్పట్లేదు వరల్డ్ కప్ లో కనీసం సెమిస్ కి కూడా చేరుకోలేకపోయింది పాకిస్తాన్ క్రికెట్ టీం. అందుకని పాకిస్తాన్ టీం గురించి అంతా చులకనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ పరిస్థితిని పాకిస్తానే తెచ్చుకుంది. ఆట కంటే ఇతర విషయాల మీద ఫోకస్ చేయడం, జట్టులో యూనిటీ లేకపోవడం వలన పాకిస్తాన్ ఓటమిపాలైంది. టీం సెలక్షన్ల విషయంలో కూడా రాజకీయాలు. దీంతో పాకిస్తాన్ కి ఓటమి తప్పలేదు.
Advertisement
వరల్డ్ కప్ లో ఈజీగా పాకిస్తాన్ ఓడిపోయింది. టోర్నీ తర్వాత బాబర్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళింది పాకిస్తాన్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ టీం ని ఎవరు పట్టించుకోలేదు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎయిర్పోర్టులో ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. డిసెంబర్ 14 నుండి పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ మొదలు కాబోతోంది. 3 మ్యాచ్లో కోసం ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ అడుగుపెట్టింది. ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్తాన్ జట్టుకి షాక్ తగిలింది వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. అసలు వాళ్ళని పట్టించుకోలేదు.
Advertisement
పాకిస్తాన్ ఎంబసీ ఇన్ ఆస్ట్రేలియా వెల్కమ్ చెప్పిందా అంటే అది కూడా లేదు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ళకి షాక్ తగిలింది కాసేపటి తర్వాత కూడా పట్టించుకోలేదు. వారి సామాన్లని వాళ్లే ట్రక్కుల్లోకి ఎక్కించుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం కొత్త కెప్టెన్ గా షాన్ మసూద్ ని ఎంపిక చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆటగాళ్లు వాళ్ళ సామాన్లుని మోస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఇండియా వస్తే వాళ్ళకి వెల్కమ్ లభించింది హైదరాబాద్ లోకల్ ఫాన్స్ కూడా ఆటగాళ్లని చూడడానికి వచ్చారు ఆస్ట్రేలియాలో అడుగుపెడితే మాత్రం కనీసం లగేజీ మోసే వాళ్లు కూడా లేరని ఇండియాలో అభిమానులు కూడా మద్దతు ఇచ్చారని అంతా అంటున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!