Home » పెళ్లిలో భార్యకు గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు..ఫోటోలు వైరల్

పెళ్లిలో భార్యకు గాడిదను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు..ఫోటోలు వైరల్

by Bunty

పెళ్లి అంటే నూరేళ్లపంట అంటుంటారు. కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లిలను రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా వారు జరుపుకుంటారు. కొన్ని పెళ్లిళ్లు ట్విస్టుల మీద ట్విస్ట్ లు జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లు మొదటి నుంచి చివరిదాకా ఉత్కంఠభరితంగా సాగుతూ, మధ్యలోనే ఊహించని ట్విస్ట్ లతో షాక్ ఇస్తున్నారు.

READ ALSO : అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి !

అయితే, పెళ్లిళ్లకు హాజరయ్యేటప్పుడు నూతన వధూవరులకు కట్న కానుకలు అందించడం కామన్. కానీ ఇందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వినూత్న గిఫ్ట్ ఇచ్చే సర్ప్రైజ్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. అజలాన్ అనే వ్యక్తి వరిషా అనే యువతని పెళ్లాడాడు. పెళ్లి మండపంలోనే వధువుకు ఓ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వరుడు వధువుకి ఓ గాడిదపిల్లను గిఫ్ట్ గా ఇచ్చాడు. దానిని చూసిన వధువు షాక్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి ముందే తెలుసు వధువు జంతువు ప్రేమికురాలని.

అందుకే చిన్న గాడిద పిల్లను ఆమెకు వివాహ కానుకగా ఇవ్వాలనుకున్నట్లు వరుడు చెప్పాడు. కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను వరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోలో పెళ్లిలో బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని వధువు అడిగితే ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని వరుడు బదులిచ్చాడు. అంతేగాక గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదని, తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉందని తెలిపాడు.

 

 

Visitors Are Also Reading