Home » పాకిస్థాన్ కు సెమీస్ చేరే అవకాశాలు ఇలా… వర్షమే దిక్కు..!

పాకిస్థాన్ కు సెమీస్ చేరే అవకాశాలు ఇలా… వర్షమే దిక్కు..!

by Azhar

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో రెండు గ్రూప్ లు ఉండగా.. మన ఇండియా ఉన్న గ్రూప్ బి అనేది చాలా ఈజీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ గ్రూప్ చాలా ఉత్కంఠంగా మారింది. ఈరోజు పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనేది మొత్తం లెక్కలు మార్చేశాయి. ఇందులో సఫారీలు గెలుస్తారు అనుకున్నారు.. కానీ పాక్ విజయం సాధించడంలో సెమీస్ రేస్ లోకి ఆ జట్టు వచ్చింది.

కానీ పాకిస్థాన్ కు సెమీస్ చేరే అవకాశాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి. మొదట ఆ జట్టు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి 2 పాయింట్లకు తెచ్చుకొని మొత్తం 6 పాయింట్లు చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మిగితా జట్ల పైన ఆధారపడాలి. ఇండియా, జింబాబ్వే మ్యాచ్ లో మనం ఓడిపోవాలి.. అలాగే సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ పైన ఓడిపోవాలి. అప్పుడే పాక్ రన్ రేట్ తో సెమీస్ కు రాగలదు. కానీ అది జరిగే పని కాదు.

ఇప్పుడు పాకిస్థాన్ కు కేవలం వర్షం మాత్రమే సహాయం చేయగలదు. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటికే వర్షం వల్ల నాలుగు మ్యాచ్ లు రద్దయ్యాయి. అయితే ఈ వర్షం వల్ల మన ఇండియా మ్యాచ్ రద్దు అయిన మనం 7 పాయింట్లతో సెమీస్ కు వెళ్తాము. కానీ 5 పాయింట్లు ఉన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఆ జట్టుకు 6 పాయింట్లు అవుతాయి. అయితే ప్రస్తుతం మనకంటే ఎక్కువ సఫారీల కంటే కొంచెం తక్కువ రన్ రేట్ ఉన్న పాక్.. బంగ్లా పై విజయంలో దానిని దాటేస్తే సెమీస్ కు వెళ్తుంది. చూడాలి మరి వర్షం పాక్ ను సెమీస్ చేరుస్తుందా అనేది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ పై పెరుగుతున్న ఆరోపణలు.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ..?

ఇండియా గెలవాల్సిందే..?

Visitors Are Also Reading