Home » Hyderabad : భార్య కోసం హైదరాబాద్ వచ్చేసిన పాకిస్థానీ

Hyderabad : భార్య కోసం హైదరాబాద్ వచ్చేసిన పాకిస్థానీ

by Bunty
Ad

ప్రేమకు ఏది అడ్డుకాదని మరో జంట నిరూపించారు. ప్రేమకి వయసుతో పాటు దేశాలు, రాష్ట్రాలు కూడా అడ్డు కాదని నిరూపించారు ఈ జంట. పాకిస్తానీ అబ్బాయి ఫయాజ్ అహ్మద్ (27), హైదరాబాద్ అమ్మాయి ఫాతిమా (29) అనే అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2018లో దుబాయ్ లోని షార్జాకి పనిచేయడానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.

Pakistan-Man-In-Hyderabad-1

Pakistan-Man-In-Hyderabad-1

వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఇక గత సంవత్సరం ఫాతిమా కొడుకుని తీసుకుని హైదరాబాద్ కు వచ్చేసింది. దీంతో తన భార్యను, కొడుకును చూడడానికి ఫయాజ్ కూడా ఇండియాకు రావాలని అనుకున్నాడు. కానీ వీసా దొరక్కపోవడంతో రాలేకపోయాడు. ఇక తన అత్త, మామ సహాయంతో ఫయాజ్ పాకిస్తాన్ నుంచి నేపాల్ వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఇక హైదరాబాదులో ఫయాజ్ కు ఆధార్ కార్డ్ చేపించాలని పాతబస్తీలోని ఓ సెంటర్ కి వెళ్ళారట ఫయాజ్ అత్త, మామ. ఈ క్రమంలోనే ఈ విషయం పోలీసులకు తెలిసిపోయింది.

Advertisement

Advertisement

ఇక పోలీసులు ఫయాజ్ ను వెతికి పట్టుకున్నారు. దీంతో భయపడి తన అత్త, మామ పారిపోయారు. ఇక ఫయాజ్ ను పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇండియా బార్డర్ లో సెక్యూరిటీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఒక సామాన్యమైన వ్యక్తి బార్డర్ దాటి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో ఫయాజ్ ను చాలా సులువుగా పట్టుకున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.

ఇవి కూడా చదవండి 

నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ విలువ ఎంతో తెలుసా?

చిరంజీవి, బాలయ్య ఇద్దరి మధ్య తేడా చూడండి…!

టాలీవుడ్‌ హీరోయిన్‌ కు హైదరాబాద్‌ లో ఫ్లాట్‌ కొనిచ్చిన జగపతి బాబు ?

Visitors Are Also Reading