Home » ఐపీఎల్ పెంపుపై ఐసీసీ వద్ద పాక్ బోర్డు ఏడుపు..!

ఐపీఎల్ పెంపుపై ఐసీసీ వద్ద పాక్ బోర్డు ఏడుపు..!

by Azhar
Ad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఇప్పుడు ప్రపంచంలోని క్రికెట్ కు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ లీగ్ వల్ల క్రికెట్ అంటే ఏంటో తెలియని దేశాలకు కూడా ఇప్పుడు క్రికెట్ గురించి తెలుస్తుంది. అయితే 2008 లో ప్రారంభమైన ఈ లీగ్ అనేది ఇప్పుడు ఎవరు అందుకోలేనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఈ ఐపీఎల్ మీడియా రైట్స్ ను వేలం వేయగా.. 48 వేళా కోట్ల కంటే ఎక్కువగా అందుకుంది. ఇక ఐపీఎల్ ఎదుగుదలను చుసిన తర్వాత.. పాకిస్థాన్ ఏడవకుండా ఉండటం అనేది జరగని పని. ఇప్పుడు ఐసీసీ వద్ద ఇదే ఐపీఎల్ పై పాక్ బోర్డు తన ఏడుపు అనేది ప్రారంభించింది.

Advertisement

అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు అనేవి రావడంతో… మ్యాచ్ ల సంఖ్యను కొద్దిగా పెంచింది బీసీసీఐ. కానీ ఇప్పటివరకు రెండు నెలలు జరిగిన ఈ లీగ్ ను రెండున్నర నెలలు చేయడానికి ఐసీసీ వద్ద ప్రతిపాదన ఉంచగా… ఐసీసీ అందుకు ఒప్పుకుంది. ఐపీఎల్ ను తన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం లో కూడా చేర్చింది. ఇందువల్ల ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ద్వైపాక్షిక సిరీస్లు అనేవి తక్కువగా జరుగుతాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని చూపిస్తూ.. ఐసీసీ వద్ద తన వాదన అనేది వినిపిస్తుంది పాక్ బోర్డు.

Advertisement

ప్రపంచంలో అన్ని లీగ్స్ యొక్క మ్యాచ్ ల సంఖ్యను తగ్గిస్తూ పోతుంటే… ఐపీఎల్ లో మాత్రం పెంచుతూ పోతున్నారు. అయితే ఈ ఐపీఎల్ ను రెండున్నర నెలలు చేయడం వల్ల ద్వైపాక్షిక సిరీస్ లు అనేవి తగ్గిపోతున్నాయి. అందువల్ల క్రికెట్ బోర్డులకు నష్టం అని పాక్ బోర్డు పేర్కొంది. కానీ ఇక్కడ పాకిస్థాన్ కు వేరే ఏ దేశ బోర్డు కూడా తన మద్దతు ఇవ్వలేదు. ఎందుకంటే.. పాక్ మినహా మిగితా అన్ని దేశాల ఆటగాళ్లు ఇందులో ఆడుతూ… డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక అందులో కొంత భాగం ఆ దేశాల బోర్డులకు కూడా పోతుంది. కానీ ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. ఎందుకో అందరికి తెలుసు. అందుకే పాక్ బోర్డు ఇలా ఏడుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ముంబై వదిలేయడంతో షాక్ లోకి పాండ్య..!

కోహ్లీని సపోర్ట్ చేసిన జొకోవిచ్.. ఎలా అంటే…?

Visitors Are Also Reading