Home » ఆర్ఆర్ఆర్ ఓ ‘గే ల‌వ్ స్టోరీ’ అంటూ ఆస్కార్ విన్న‌ర్ కామెంట్.. అభిమానులు ఫైర్

ఆర్ఆర్ఆర్ ఓ ‘గే ల‌వ్ స్టోరీ’ అంటూ ఆస్కార్ విన్న‌ర్ కామెంట్.. అభిమానులు ఫైర్

by Anji
Ad

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఎన్టీఆర్‌-రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా అద్భుతంగా న‌టించారు. ఆర్ఆర్ఆర్ సినిమా పై సౌండ్ ఇంజ‌నీర్ ప్ర‌ఖ్యాత ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ర‌సూల్ పూ కుట్టి వివాద‌పస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను గే ల‌వ్ స్టోరీ అంటూ ట్విట్ట‌ర్‌లో ఆదివారం కామెంట్ చేశారు. దీనిపై ఆర్ఆర్ఆర్ అభిమానులు ర‌సూల్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


ఆర్ఆర్ఆర్ చెత్త సినిమా 30 నిమిషాలు చూశాన‌ని న‌టుడు, ర‌చ‌యిత మునీష్ భ‌ర‌ద్వాజ్ ఓ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన ర‌సూల్ గేల‌వ్ స్టోరీ రీ ట్వీట్ చేసాడు. ఆలియాభ‌ట్‌ను ఆస‌రాగా ఉప‌యోగించుకున్నార‌ని.. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక దీనిపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు చాలా కోపంగా రియాక్ట్ అవుతున్నారు. ఆస్కార్ స్థాయి వ్య‌క్తి ఇలాంటి కామెంట్లు చేస్తార‌నుకోలేద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. తెలుగు సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు రావ‌డాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నట్టు అభిమానులు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

.

 

కామెంట్ల రూపంలో విమ‌ర్శలు వెల్లువెత్త‌డం వ‌ల్ల ర‌సూల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి స్పందించారు. త‌నంత‌ట తాను అన‌లేద‌ని.. ప‌బ్లిక్ డొమైన్‌లో ఉన్న‌దే చెప్పాను అంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేవిధంగా పోస్ట్ చేశారు. ఇక 1920 నాటి క‌థాంశంతో అల్లూరి సీతారామ‌రాజు,కొమురం భీమ్ నేప‌థ్యంలో ఈ క‌థ‌ను తెరకెక్కించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దేశ‌వ్యాప్తంగా రికార్డును సృష్టించిన ఈ సినిమా గురించి ర‌కూల్ అలా స్పందించ‌డంపై ద‌ర్శ‌కుడు, హీరోలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మ‌రి.

Also Read : 

ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..అందుకోస‌మేనా..?

2022లో విడుద‌లై కేవ‌లం ఫ‌స్ట్ హాఫ్ వ‌ల్ల సూప‌ర్ హిట్ అయ్యిన 5 సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading