కొన్ని సార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. లేనివి ఉన్నట్టుగా.. ఉన్నవి లేనట్టుగా కనిపిస్తుంటాయి. కొన్ని సార్లు అయితే ఉన్న వాటిని కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది. దీనినే ఆఫ్టికల్ ఇల్యూషన్ అంటారు. ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్ కారణంగా ఉన్నట్టు లేనట్టు, లేనిది ఉన్నట్టు అనిపిస్తుంటుంది. తాజాగా అలాంటిఓ ఆఫ్టికల్ ఇల్యూషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఇల్యూషన్ ఫోటోలు, ఫజిల్స్ కనిపెట్టడం అనేది ఓ టాస్క్ మాదిరిగా మారింది. వాటిలో ఏమున్నదో తేల్చలేక నెటిజన్లు జనాలు బుర్రలు గోక్కుంటున్నారు. ప్రస్తుతం వైరలవుతున్న ఫోటో కూడా అలాంటి పరిస్థితే తీసుకొచ్చింది. వాస్తవానికి పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్. అందులో మర్మం అద్భుతం. పెయిటింగ్ కళాకారుల ప్రతిభ వారు వేసే పేయింట్‌లో వ్యక్తికరిస్తుంది. అటువంటి కళాఖండమే అని చెప్పుకోవచ్చు.
Advertisement
Advertisement
తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ అందమైన ఫోటో చూడడానికి దేవకన్య లాంటి యువతి చిత్రంగా కనిపిస్తుంది. ఇందులో ఒక్కరూ కాదు. మరికొంత మంది మహిళలు దాగి ఉండడం ఈ పెయిటింగ్ ప్రత్యేకత. షుప్లియాక్ అనే ఉక్రెనియన్ కళాకారుడు ఈ హిడెన్ పిక్చర్ను 2013లో గీసాడు. ఈ పేయింటింగ్‌లో ఎంత మంది మహిళలున్నారనేది చాలా మంది నెటిజన్లు చెప్పలేకపోయారు. మీరు చెప్పగలరేమో ప్రయత్నించండి.. ఈ ఫోటోలో ఎంత మంది మహిళలు ఉన్నారో గుర్తించి కామెంట్ ద్వారా మీ ఆన్సర్ తెలపండి ఇంకెందుకు ఆలస్యం.
Also Read : వంద రూపాయల నోటుపై నేతాజీ ఫోటో ముద్రించాలి : పవన్ కల్యాణ్