PKL లో బెంగుళూరు బుల్స్ , బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 28-20 పాయింట్లతో బెంగుళూరు మంచి లీడ్ లో ఉంది. బెంగాల్ నుండి లాస్ట్ రైడర్ నభీభక్ష్ రైడ్ కు వెళ్లాడు. ఒక్కడిని ఔట్ చేస్తే టీమ్ ఆలౌట్ అవుతుందని బోనస్ ఇచ్చి మరీ ఆడిస్తున్నారు బెంగుళూరు డిఫెన్స్…. నభీ బోనస్ చేశాడు. రైట్ సైడ్ కార్నర్ చెయిన్ వచ్చి నబీని ట్యాకిల్ చేసింది. ఇదే సమయంలో తనను డిఫెండర్స్ టచ్ చేయకముందే నభీ లాబీలోకి వెళ్లాడు. అతడిని అనుసరిస్తూ బెంగుళూర్ టీమ్ అంతా లాబీలోకి వెళ్లింది. దీంతో అంపైర్లు నబీతో పాటు బెంగుళూరుకు చెందిన 7 గురు ఆటగాళ్లను ఔట్ గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ మ్యాచ్ లో బెంగాల్ 40-39 అంటే ఒక్క పాయింట్ తో గెల్చింది.
Advertisement
Advertisement
ఈ రూల్ బాలేదు:
కబడ్డీలో ఈ రూల్ కరెక్ట్ కాదంటూ అప్పటి నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇందో లాజిక్ లేని రూలంటూ విమర్శలు వస్తున్నాయి. డిఫెండర్లను టచ్ చేయకుండా రైడర్ లాబీలోకి వెళితే అతడిని అనుసరిస్తూ ఎంతమంది ప్లేయర్స్ వెళితే వాళ్లందరూ ఔట్ అనడం సబబు కాదు, ఆ ప్లేస్ లో ముందుగా లాబీలోకి ఎంటర్ అయిన డిఫెండర్ ను ఔట్ గా పరిగణిస్తే మంచిది అంటున్నారు కబడ్డీ నిపుణులు . నబీ బక్ష్ ఆ స్ట్రాటజీ తర్వాత చాలా టీమ్ లు అదే స్ట్రాటజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.
Watch video :